చిత్రం చెప్పే విశేషాలు..! (29-10-2022/2)

సినీనటి ఖుష్బూ తలైవా రజనీకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. రజనీకాంత్‌ను కలవడం ఆనందాన్నిచ్చిందని తెలుపుతూ పోస్టు పెట్టారు.

#Eenadu

మునుగోడు ఎన్నికల ప్రచారం సందర్భంగా వివిధ పార్టీలకు సంబంధించిన వాహనాలు, జన సమీకరణాలను ఎన్నికల ఖర్చు పర్యవేక్షణ అధికారులు ఇలా కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. సౌరశక్తితో పనిచేస్తున్న ఈ సీసీ కెమెరాలను ఈ ఎన్నికల్లో వినియోగిస్తున్నారు.

#Eenadu

మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆమె ట్రాక్టర్‌ నడిపి కార్యకర్తల్లో జోష్‌ పెంచారు.

#Eenadu

మునుగోడులో తెరాస ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ వేషధారణతో నృత్యం చేస్తూ ఆకట్టుకున్న ఓ కార్యకర్త.

#Eenadu

‘డే ఆఫ్‌ ది డెడ్‌’ ఉత్సవంలో భాగంలో మెక్సికోలో ఇలా అస్థిపంజరాలను పోలిన భారీ బొమ్మలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా అక్కడి ప్రజలు మృతి చెందిన తమ కుటుంబ సభ్యులు, మిత్రుల సమాధుల వద్దకు వెళ్లి నివాళి అర్పిస్తారు. ‘డే ఆఫ్‌ ది డెడ్‌’ ఏటా నవంబర్‌ 2న నిర్వహిస్తుంటారు.

#Eenadu


కెనడాలోని ఒంటారియోలో నిర్వహించిన పెయిర్స్‌ స్కేటింగ్‌ పోటీల్లో పలు జంటలు సాహసోపేత విన్యాసాలు చేసి ఆకట్టుకున్నాయి.

#Eenadu

జర్మనీ దేశ బాల్టిక్‌ సముద్రం తీరంలోని టిమ్మెండర్ఫర్‌ స్ట్రాండ్‌లో దట్టంగా పొగమంచు కురిసి అందంగా కనిపించింది.

#Eenadu

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర శనివారం ఉదయం మహబూబ్‌ నగర్‌ మండల పరిధిలో ప్రారంభమైంది. సినీనటి పూనమ్‌కౌర్‌ రాహుల్‌తో పాదయాత్రలో పాల్గొన్నారు.

#Eenadu

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో పోలీసు కమిషనరేట్‌ ఆధ్వర్యంలో 5కెరన్‌ నిర్వహించారు. పోలీసు కమిషనర్‌ సత్యనారాయణ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

#Eenadu

కార్తిక మాసం సందర్భంగా భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యకల్యాణానికి భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామిని దర్శించుకున్నారు.

#Eenadu

కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేసి రాయలసీమ ఆత్మగౌరవాన్ని కాపాడతామని తెలుపుతూ తిరుపతిలో వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘రాయలసీమ ఆత్మగౌరవ సభ’ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

#Eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home