చిత్రం చెప్పే విశేషాలు..! (30-10-2022/2)

ఉత్తర్‌ప్రదేశ్‌లోని త్రివేణి సంగమం వద్ద ఛఠ్‌ పూజల కోసం తరలివచ్చిన భక్తులు.

#Eenadu

పలు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మహిళలు హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ వద్ద సంప్రదాయబద్ధంగా ఛఠ్‌ పూజలు చేశారు. సూర్యుడిని ఆరాధిస్తూ ఏటా దీపావళి తర్వాత ఈ పూజలు చేస్తుంటారు.

#Eenadu

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కొంత సమయం విశ్రాంతి తీసుకున్నాయి. ఆ సమయంలో అక్కడికి వచ్చిన శునకాన్ని రాహుల్‌ గాంధీ, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ముద్దు చేశారు.

#Eenadu

కశ్మీర్‌ ఫైల్స్‌ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి , నటుడు అనుపమ్‌ ఖేర్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీసిందు, కిషన్‌రెడ్డి సతీమణి కావ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

#Eenadu

హైదరాబాద్‌లోని లుంబినీ పార్కు వద్ద ప్రధాన రహదారిలో పిల్లలు సైకిళ్లపై ఆకట్టుకునే ఫీట్లు చేస్తూ కనిపించారు. చూడటానికి బాగానే ఉన్నా.. రోడ్లపై ఇలాంటి విన్యాసాలు చేస్తే ప్రమాదానికి గురయ్యే ఆస్కారం ఉంది.

#Eenadu

టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా పెర్త్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిప మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ పోటీల్లో మొత్తంగా 1000 పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సాధించాడు.

#Eenadu

సినీనటుడు వరుణ్‌తేజ్‌ తన తండ్రి నాగబాబుతో కలిసి లండన్‌లో పర్యటిస్తున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. తన తండ్రితో షికారుకెళ్తున్నట్లు తెలుపుతూ పోస్టు పెట్టారు.

#Eenadu

ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌లో మహిళల ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం నిర్వహించిన అర్హత పోటీల్లో పలువురు శరీరాన్ని విల్లులా వంచి సాహసోపేత విన్యాసాలు చేశారు.

#Eenadu

ప్రముఖ సినీనటి నమిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం తన భర్త వీరేంద్ర చౌదరితో కలిసి వెళ్లి ఆమె శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొన్నారు.

#Eenadu

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ జడ్చర్లలోని గొల్లపల్లి నుంచి మొదలైంది. రాజాపూర్‌ మీదుగా పెద్దాయపల్లి వద్ద ఉన్న అయ్యప్పస్వామి దేవాలయం సమీపం వరకు ఉదయం యాత్ర సాగింది. యాత్రలో భాగంగా ‘ఫిట్‌నెస్‌ ఫర్‌ భారత్ జోడో’ అంటూ రాహుల్‌ కాసేపు పరుగు తీశారు.

#Eenadu

నైజీరియాలోని లాగోస్‌లో ‘హైనెకెన్‌ ఫ్యాషన్‌, డిజైన్‌ వీక్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఈ ఇద్దరు మోడళ్లు విభిన్నమైన హెయిర్‌స్టైల్స్‌లో కనిపించి ఆకట్టుకున్నారు.

#Eenadu

వెనెజువెలాలోని కారకస్‌లో హాలోవీన్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బైక్‌ రైడర్లు, వీలీ, స్టాపీ విన్యాసాలు చేస్తూ అలరించారు.

#Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home