చిత్రం చెప్పే విశేషాలు..!(01-11-2022/2)

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని ఓ ఎలక్ట్రానిక్స్‌ షో రూమ్‌లో నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమానికి యువ కథానాయిక పాయల్‌ రాజ్‌పూత్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

#Eenadu

కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 67వ కన్నడ రాజ్యోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బెంగళూరులోని విధానసౌధలో నిర్వహిస్తున్న వేడుకల్లో ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ పాల్గొన్నారు. సీఎం బసవరాజ బొమ్మై ఆయనను సత్కరించారు.

#Eenadu

డెన్మార్క్‌లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఓ పోలింగ్ కేంద్రంలో ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడ్రిక్‌సన్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె తన భర్త బో టెంగ్‌బర్గ్‌ను ఇలా చుంబించారు.

#Eenadu

తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఓ అండర్‌పాస్‌ వద్ద నిలిచిన వరద నీటిలో బస్సు మొరాయించడంతో అందులోని ప్రయాణికులను అగ్నిమాపక సిబ్బంది ఇలా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

#Eenadu

హైదరాబాద్‌ నగర శివారులో ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమం బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు వీరు. అక్కడ కాస్త విరామం దొరకడంతో ఇలా కూర్చొని ఓ సెల్ఫీ తీసుకుంటూ మురిసిపోయారు.

#Eenadu

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ ఉదయం హైదరాబాద్‌ నగర శివారులోని శంషాబాద్‌ మాతా టెంపుల్‌ నుంచి ప్రారంభమైంది. యాత్రలో తనను కలిసేందుకు వచ్చిన కొందరు చిన్నారులు నృత్య విన్యాసాలు ప్రదర్శించగా.. రాహుల్ తిలకించారు. అనంతరం వారిని అభినందించారు.

#Eenadu

బాలానగర్‌ రహదారిపై సైక్లిస్టుల కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ నిర్మించారు. పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో సైకిళ్లు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.దీంతో ట్రాక్‌పై వెళ్లాల్సిన సైక్లిస్టులు రోడ్డుపై.. రోడ్డుపై వెళ్లాల్సిన ద్విచక్ర వాహనదారులు ట్రాక్‌పై ఎవరికి తోచినట్లు వారు వెళ్తున్నారు. 

తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అందుకోసం తీసుకొచ్చిన రకరకాల పూలు ఇవి.

#Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home