చిత్రం చెప్పే విశేషాలు..!(02-11-2022/2)

శేషాచల కొండల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుపతి కపిలేశ్వర ఆలయం వద్ద కపిలతీర్థం జాలువారింది. దీంతో సందర్శకులు పెద్దఎత్తున తరలివచ్చి ఇక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

#Eenadu

ఇటలీ దేశం పెరోలో ఉన్న ‘ఏరో గ్రావిటీ’ కేంద్రంలోని విండ్‌ ఫ్లై సిమ్యూలేటర్‌ టన్నెల్‌లో ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు సాండ్రో ఆండ్రియోఒట్టి ఇలా గాలిలో తేలారు.

#Eenadu

జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలో ముత్తుకుట్టి జేవియర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మిలీ’. దీన్ని బోనీ కపూర్‌ నిర్మించారు. సినిమా నవంబర్‌ 4న విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. కార్యక్రమానికి జాన్వీ.. నీలిరంగు చీరలో హాజరై సందడి చేశారు.#Eenadu

ప్రముఖ సినీనటుడు షారుఖ్‌ ఖాన్‌కు సోనూసూద్‌ ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి కండలు చూపుతున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘షా.. ఏలుతూనే ఉండు’ అని తెలుపుతూ సోనూసూద్‌ పోస్టు పెట్టారు.

#Eenadu

టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లీ అవతరించాడు. అడిలైడ్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఉన్న జయవర్థెనె(1,016)ను కోహ్లీ అధిగమించాడు.

#Eenadu

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ నగరంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం గాంధీయన్‌ ఐడియాలజీ సెంటర్‌ నుంచి ప్రారంభమైన యాత్ర న్యూబోయిన్‌పల్లి, బాలానగర్‌ మెయిన్‌రోడ్డు, సుమిత్రా నగర్‌ ఐడీపీఎల్‌ ఉద్యోగుల కాలనీ మీదుగా మదీనాగూడ చేరుకుంది.

#Eenadu

హైదరాబాద్‌ నగరం కొండాపూర్‌లోని ఓ మాల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన నగల దుకాణాన్ని సినీ నటి రాశీఖన్నా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె నవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. ఏ ఆభరణాలు తనకు నప్పుతాయోనని ధరించి చూశారు.

#Eenadu

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సన్నద్ధమవుతున్నారు. చండూరులోని ఓ జూనియర్‌ కళాశాలలో పోలింగ్‌ సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్‌ యూనిట్‌లను ఈ ఉదయం నుంచి పంపిణీ చేశారు. సామగ్రి తీసుకొని కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది బయలుదేరి వెళ్లారు.

#Eenadu

విష్ణు విశాల్‌ హీరోగా దర్శకుడు చెల్లా అయ్యావు తెరకెక్కించిన చిత్రం ‘మట్టి కుస్తీ’. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. రెజ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

#Eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home