చిత్రం చెప్పే విశేషాలు..!(03-11-2022/2)

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

#Eenadu

ఈ చిత్రంలో కన్పిస్తున్నవి క్రీస్తు పూర్వం 2300 సంవత్సరానికి చెందిన మార్బుల్ బొమ్మలు. గ్రీస్‌ దేశం ఏథెన్స్‌ నగరంలోని ఓ ఎగ్జిబిషన్‌లో వీటిని ప్రదర్శనకు ఉంచారు.

#Eenadu

అమెరికన్‌ గాయని, నటి సెలెనా గొమేజ్‌ లాస్‌ ఏంజెలెస్‌లో తన డాక్యుమెంటరీ ‘మై మైండ్‌ అండ్‌ మీ’ వరల్డ్‌ ప్రీమియర్‌కు హాజరై సందడి చేశారు.

#Eenadu

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాహుల్‌ గాంధీ, ములుగు ఎమ్మెల్యే సీతక్క, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గిరిజనులతో కలిసి సందడిగా థింసా నృత్యం చేశారు.

#Eenadu

మంచిర్యాలలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ చిన్నారుల స్ఫూర్తిని కొనియాడారు.

#Eenadu

దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి పార్థివ దేహానికి నంద్యాల జిల్లా అవుకులోని నివాసంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

#Eenadu

ఉప్పల్‌ నుంచి మియాపూర్‌కు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు కూకట్‌పల్లి చేరుకోగానే ఇంజిన్‌ గేర్‌లో సమస్య తలెత్తింది. దీంతో అందులో ఉన్న మరో ఉద్యోగి ఇంజిన్‌ పెట్టెలో గేర్లను మారస్తుండగా డ్రైవర్‌ స్టీరింగ్‌ పట్టి బస్సును నడుపుతూ కనిపించారు.

#Eenadu

ఇటీవల సినీనటుడు రామ్‌చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ఆఫ్రికాలో పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఉపాసన తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

#Eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home