చిత్రం చెప్పే విశేషాలు..!

(04-11-2022/2)


సూర్యుడిని క్రేన్‌తో పైకి ఎత్తుతున్నట్లు ఉంది కదూ ఈ చిత్రం. మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం సమీపంలో గురువారం సాయంత్రం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.

#eenadu

దిల్లీలో కాలుష్యం నానాటికీ పెరుగుతోంది. దీంతో అక్కడి కాలుష్యకారక పరిశ్రమలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రైమరీ స్కూల్స్‌ మూసివేసి ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపింది. కాలుష్య తీవ్రతకు సంబంధించిన ఫొటోలను ఇక్కడ చూడవచ్చు.

#eenadu

అమెరికన్‌ నటి జెన్నా డివాన్.. లాస్‌ ఏంజెలెస్‌లో నిర్వహిస్తున్న ‘ఆమ్‌ఫార్‌ గాలా’ కార్యక్రమానికి నలుపు రంగు దుస్తుల్లో హాజరై సందడి చేశారు..

#eenadu

కార్తిక మాసం సందర్భంగా విజయవాడ కనకదుర్గ ఆలయంలో వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సహస్ర లింగార్చన సేవ నిర్వహించారు.

#eenadu

హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో డిజైర్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని నూతన డిజైనర్‌ దుస్తులను ధరించి ఫొటోలకు పోజులిచ్చారు..

#eenadu

హైదరాబాద్‌ నగర సుందరీకరణలో భాగంగా బేగంపేటలోని ఫ్లైఓవర్‌ను కళాకారులు పల్లె అందాల బొమ్మలతో తీర్చిదిద్దారు..

#eenadu

ఈజిప్టులో రాజు టుటన్‌ఖామున్‌ టూంబ్‌ను కనుగొని 100 ఏళ్లు అయిన సందర్భంగా వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. పర్యాటకులు టూంబ్‌ లోనికి వెళ్లి అక్కడి చిత్రాలను తమ చరవాణుల్లో బంధిస్తూ కనిపించారు. బ్రిటిష్‌ ఆర్కియాలజిస్టు హోవర్డ్‌ తన బృందంతో నవంబర్‌ 4, 1922లో దీన్ని కనుగొన్నారు.

#eenadu

అశోక్‌ సెల్వన్‌, రీతూవర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో కార్తిక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆకాశం’ నేడు విడుదలైంది. ఈ సందర్భంగా రీతూవర్మ చిత్రబృందంతో కలిసి సెల్ఫీ తీసుకొని సందడి చేశారు. ఫొటోలో సినిమా నటీనటులతో పాటు శివాని రాజశేఖర్‌ ఉన్నారు.

#eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home