చిత్రం చెప్పే విశేషాలు..!
(05-11-2022/1)
జీవీఎంసీ 5వవార్డు శివశక్తి నగర్‌లో మొజ్జాడ చుక్కమ్మ ఇంటి పెరట్లో ఓ బొప్పాయి చెట్టుకు కాసిన కాయల్లో ఒకటి పక్షి ఆకృతిలో చూపరులను ఆకట్టుకుంది.
#Eenadu
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో అయ్యప్ప మాలధారులకు ముస్లిం కుటుంబం భిక్ష ఏర్పాటుచేసి మత సామరస్యాన్ని చాటారు. గ్రామానికి చెందిన షేక్ బాజీ కుటుంబం 30మంది అయ్యప్ప మాలధారులకు శుక్రవారం మధ్యాహ్న భోజనం(భిక్ష), రాత్రి అల్పాహారాన్ని ఏర్పాటు చేసి వడ్డించారు.
#Eenadu
తెలంగాణ రాష్ట్ర సచివాలయ నూతన భవన నిర్మాణంలో కీలకఘట్టం ముగిసింది. భవనంపై అతిపెద్ద గుమ్మటాన్ని ‘డోము’ ఏర్పాటు చేశారు. ప్రాంగణం ముందు వైపు కనిపించే మరో గుమ్మటాన్ని కూడా ఏర్పాటు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
#Eenadu
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల పెద్ద చెరువులో శుక్రవారం మత్స్యకారుడు వెంకన్న వలకు వింత ఆకారంలో ఉన్న ఈ చేప చిక్కింది. నాలుగు కిలోల బరువున్న ఇది బంగారు తీగ జాతికి చెందినది. దీని తల విచిత్రంగా ఉండడంతో పలువురు దానిని ఆసక్తిగా చూశారు.
#Eenadu
బాపట్ల జిల్లా మేదరమెట్లలో కొండను తొలచి బైపాస్ మార్గం నిర్మించారు. కొండ అంచు భాగాన్ని పూర్తిగా తొలగించకపోవడంతో అక్కడ రాళ్లు తరచూ జారి కిందపడుతున్నాయి. ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
#Eenadu
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని జేజే ఆసుపత్రి ప్రాంగణంలో 132 ఏళ్ల క్రితం నాటి ఓ సొరంగం తాజాగా బయటపడింది. దాని పొడవు 200 మీటర్లు. భారత్‌లో బ్రిటిష్ పాలన కొనసాగుతుండగా.. 1890లో శంకుస్థాపన చేసి ఆ సొరంగాన్ని నిర్మించినట్లు వెల్లడైంది.
#Eenadu
గీతాంజలి గ్రూప్ స్కూల్స్ వార్షికోత్సవం సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బీడీఎల్ ఫైనాన్స్ అడ్మిషన్ డైరెక్టర్ నూక శ్రీనివాసులు హాజరై ప్రసంగించారు. విద్యార్థులు వివిధ రాష్ట్రాల నైపుణ్యాన్ని తమ నాటక రూపంలో ప్రదర్శించడం అందరిని ఆకట్టుకుంది.
#Eenadu
డిసెంబరు 7-11 మధ్య పుణెలో జరిగే ప్రీమియర్ టెన్నిస్ లీగ్‌లో తలపడనున్న ఫైన్ క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్ టెన్నిస్ టీం లోగో, ఏకరూప దుస్తులను శుక్రవారం శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆవిష్కరించారు.
#Eenadu