చిత్రం చెప్పే విశేషాలు..!(05/11/2022/2)

భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తన జన్మదిన వేడుకల్లో భాగంగా ఆస్ట్రేలియాలో తోటి క్రీడాకారుల మధ్య కేకు కోశారు. టీ20 ప్రపంచకప్‌ పోటీల కోసం భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆదివారం సెమీస్‌ బెర్తు కోసం భారత జట్టు జింబాబ్వేతో తలపడనుంది.

#Eenadu

భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ గీత కార్మికులు వినియోగించే కల్లు కుండ, మోకు తాడుతో సందడి చేశారు..

#Eenadu

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 200వ రోజు శనివారం మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం గుడిపేట్ గ్రామంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎడ్లబండిని నడుపుతూ కార్యకర్తల్లో జోష్‌ పెంచారు.

#Eenadu

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై రాళ్ల దాడిని ఖండిస్తూ తిరుపతి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో తిరుమలలో 108 కొబ్బరికాయలు కొట్టారు. అంతా మంచి జరగాలని స్వామివారిని ప్రార్థించారు.

#Eenadu

ఈ ఫొటో చూసి పోలీసు స్టేషన్‌లో సెల్‌ఫోన్ల దుకాణం పెట్టారనుకుంటున్నారా. అదేం లేదండి.. కర్నూలులోని పోలీసు స్టేషన్‌లో ‘మొబైల్‌ రికవరీ మేళా’ నిర్వహించారు. ఇందులో భాగంగా రికవరీ చేసిన 1,047(సుమారు రూ.2.50కోట్ల విలువ) గల చరవాణులను బాధితులకు అందజేశారు.

#Eenadu

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాణపురానికి చెందిన లింగయ్య ఏడాది కాలంగా ఇస్త్రీని బొగ్గులు, విద్యుత్తుతో కాకుండా గ్యాస్ సిలిండర్‌ను వినియోగించి చేస్తున్నాడు. బొగ్గులు ప్రస్తుతం లభించడం లేదని, విద్యుత్తు వాడితే రూ.3వేల వరకు బిల్లు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

#Eenadu

మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో తెదేపా, జనసేన సానుభూతిపరులు, కార్యకర్తలకు చెందిన 53 ఇళ్లు, ప్రహరీలు కూల్చివేసిన విషయం తెలిసిందే. దీంతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇప్పటం వెళ్లి బాధితులను పరామర్శించారు. ఆయన్ను చూసేందుకు ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.

#Eenadu

టీమ్‌ఇండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ పుట్టిన రోజు నేడు. పొట్టి ప్రపంచ కప్‌ నేపథ్యంలో ఈరోజు ఆయన అభిమానులు వేడుకలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సుదర్శన్‌ 35 ఎంఎం థియేటర్‌ ముందు కోహ్లీ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

#Eenadu

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. బండ్ల బాపయ్య విద్యాసంస్థల శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు విజయవాడ నుంచి పినాకిని ఎక్స్‌ప్రెస్‌ రైలులో చీరాలకు బయలుదేరారు. ప్రజల మధ్య వారిలో ఒకరిగా ప్రయాణించడం ఆనందాన్నిచ్చిందని ఆయన తెలిపారు.

#Eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home