చిత్రం చెప్పే విశేషాలు!

(09-11-2022/1)

హైదరాబాద్‌కు చెందిన శ్రీ అష్టోత్తర శత చుక్కలాస్‌ ఛారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ వేణుకుమార్‌ చుక్కల 300వ సారి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.. 1,008 పర్యాయాలు కాలినడకన తిరుమలకు చేరుకోవాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. 

source:Eenadu

నిజామాబాద్‌ జిల్లాలో వరి కోతలు పూర్తయిన చోట్ల రైతులు రహదారులపైనే ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. రోజుల తరబడి వాటిని అలాగే ఉంచడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రివేళల్లో ద్విచక్రవాహనదారులు అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.

source:Eenadu

జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం ఆసుపత్రి పారిశుద్ధ్య సిబ్బంది స్ట్రెచర్‌పై రాళ్లు మోస్తున్న దృశ్యమిది. భవనం పైభాగంలో మంచినీటి ట్యాంక్‌లకు ప్లాట్‌ఫామ్‌లు నిర్మిస్తున్నారు. అందుకు అవసరమైన నిర్మాణ సామగ్రిని పారిశుద్ధ్య సిబ్బంది తరలిస్తున్నారు.

source:Eenadu

హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో ఔట్‌ పేషెంట్‌ (ఓపీ) వైద్యం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ప్రయాణ ఇబ్బందుల దృష్ట్యా ముందు రోజు రాత్రికే ఇక్కడకు చేరుకుంటారు. వారికి ఆసుపత్రి ప్రాంగణంలో ఇలా రాత్రిపూట నిద్రించేందుకు సౌకర్యాలు లేక చలికి ఇబ్బందులు పడుతున్నారు.  

source:Eenadu

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ చౌరస్తాలో రోడ్డు దాటేందుకు ఓ వృద్ధురాలు ఇబ్బంది పడ్డారు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఆయుబ్‌ ఈ విషయాన్ని గ్రహించారు. వెంటనే ఆ వృద్ధురాలి వద్దకు వెళ్లి ఆమెను రోడ్డు దాటించి మానవత్వాన్ని చాటారు. 

source:Eenadu

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఒకటే చెట్టు. ఒక వైపు పచ్చదనంతో కళకళలాడుతుంటే.. మరోవైపు ఎండిపోయి మోడులా మారింది. దూరం నుంచి చూసినవారికి పక్కపక్కనే రెండు వృక్షాలు ఉన్న భావన కలుగుతుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం పల్లెమోనికాలనీలో కనిపిస్తున్న దృశ్యమిది. 

source:Eenadu

జీవితంలో కొత్త అంకం మొదలైంది. కళాశాల విద్య పూర్తిచేసుకుని క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఎంపికై బయో డైవర్సిటీ సమీపంలోని ఓ ఐటీ సంస్థలో విధులు నిర్వహించేందుకు తొలిరోజు తల్లిదండ్రులు, బంధువులతో చేరుకున్న ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోలాహలమిది.  

source:Eenadu

మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలాన్ని మంచు దుప్పటి కప్పేసింది. దీంతో ముందు వచ్చే వాహనాలు కనపించక చోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 7.30 అయినా మంచు తొలగకపోవడంతో లైట్లు వేసుకుని వాహనాలు నడిపారు. రహదారులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

source:Eenadu

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home