చిత్రం చెప్పే విశేషాలు!

(12-11-2022/2)

తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ రాక సందర్బంగా హైదరాబాద్‌లోని బేగంపేటలో భాజపా ఆధ్వర్యంలో ఘనంగా స్వాగత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు నరేంద్ర మోదీకి రాముడు, మోదీ పక్కపక్కన ఉన్నట్లుగా చిత్రించిన ఫొటోను బహుకరించారు.

source:Eenadu

వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ బ్రియాన్‌ లారాను కలిసిన ఫొటోను సచిన్‌ తెందూల్కర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. కొన్ని స్నేహాలు శాశ్వతంగా నిలిచి ఉంటాయని తెలుపుతూ ఆయన పోస్టు పెట్టారు.

source:Eenadu

విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అక్కడి రుషికొండ బీచ్‌లోని ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు.

source:Eenadu

తిరుమలలో గత మూడు రోజులోగా వర్షం కురుస్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో సాయంత్రం శ్రీవారి ఆలయం ఇలా కనిపించింది.

source:Eenadu

తిరుమలలోని కపిలేశ్వరాలయంలో శనివారం శ్రీవారికి ఘనంగా లక్ష బిల్వార్చన నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

source:Eenadu

ఓ వైపు నూతన సచివాలయం, మరో వైపు ఫార్ములా వన్‌ రేసు కోసం ప్రత్యేక రహదారి నిర్మాణం కొనసాగుతోంది. ఈ పనుల్లో శ్రామికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అలా అలసిన ఓ శ్రామికురాలు ఫార్ములా వన్‌ రేసు కోసం తెచ్చిన కొన్ని పాత టైర్లను పాన్పుగా చేసుకొని సేద తీరుతూ కనిపించింది.

source:Eenadu

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో నిర్వహించిన హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌లో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

source:Eenadu

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home