చిత్రం చెప్పే విశేషాలు!

(14-11-2022/1)

రాష్ట్రంలోని నగర ప్రాంతాల్లో కాలుష్యం పెరిగిపోతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) గణాంకాలు విడుదల చేసింది. దీంతో విజయవాడ నగరపాలక సంస్థలో అధికారులు రోడ్లపై దుమ్మును తొలగించి.. నీళ్లు చల్లుతూ గాలి నాణ్యతను పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.

source:eenadu

ఖమ్మంకి చెందిన డుంగ్రోతు మస్తాన్‌ పన్నెండేళ్ల క్రితం రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. చేతులతోనే నాట్య ప్రదర్శనలిచ్చి ఉపాధి పొందుతున్నారు. తమ దీన పరిస్థితిని కలెక్టర్‌కు వివరించేందుకు భర్తను భుజాలపై ఎత్తుకొని భార్య సంధ్య గ్రీవెన్స్‌కు వచ్చారు. 

source:eenadu

నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. గమ్యస్థానం చేరుకోవాలన్న లక్ష్యంతో తమ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. భూత్పూర్‌ - నాగర్‌కర్నూల్‌కు వెళ్లే మార్గంలో గోప్లాపూర్‌ వద్ద కాటన్‌ లోడుతో వెళ్తున్న వాహనంపై 10 మందికి పైగా ఇలా ప్రయాణించారు.

source:eenadu

అనంతపురం రైల్వేస్టేషన్లో శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. రైలు కూతకంటే వీటి అరుపులే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.

source:eenadu

మనుబోలు పంచాయతీ యాచవరం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆలూరి రాము ఆచారి కార్తిక మాసం మూడో సోమవారం సందర్భంగా మిరియాలతో శివలింగాన్ని రూపొందించారు. వేయి మిరియాలతో అరచేతిలో ఇమిడిపోయే ఆకృతితో శివలింగాన్ని తీర్చిదిద్ది ప్రదర్శించారు. 

source:eenadu

నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌కు చెందిన పత్రచిత్రలేఖరి గుండు శివకుమార్‌ రావి ఆకుపై చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేసేలా చిత్రించారు.

source:eenadu

కల్మషం లేని నవ్వు.. ఆట తప్ప మరేమి పట్టని మనసుతో కపోతాల నడుమ భాగ్యనగరంలోని ట్యాంక్‌బండ్‌పై స్వేచ్ఛగా ఆడుకుంటున్న చిన్నారులు వీరు.

source:eenadu

ఆదివారం బొర్రా గుహలకు పోటెత్తిన పర్యాటకులు.

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home