చిత్రం చెప్పే విశేషాలు!
(17-11-2022/1)
నటశేఖర కృష్ణ కడసారి చూపు కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. వందలాది చిత్రాలతో తమను అలరించి దిగంతాలకేగిన సూపర్‌స్టార్‌కు తుది వీడ్కోలు పలికేందుకు వచ్చిన వారితో బుధవారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానం రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.
source:Eenadu
గొల్లభామ జాతి కీటకాలు ఎక్కువగా ఆయా ప్రాంతాల వాతావరణానికి తగ్గ రంగుల్లో కలిసిపోయి సంచరిస్తుంటాయి. పరీక్షగా చూస్తేగానీ గుర్తుపట్టలేం. అలా బుధవారం విశాఖపట్నం కంచరపాలెంలోని జాతీయ రహదారి పక్కన మొక్కలపై ఉన్న గొల్లభామ పట్టుకునే లోపే క్షణాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయింది.
source:Eenadu
ఓ రైతు వినూత్న ఆలోచన లాభాల సిరులు కురిపిస్తోంది. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గాంధీపురం గ్రామానికి చెందిన నర్సరీ రైతు ప్రకాష్.. ఎకరా పొలంలో చామంతి సాగు చేస్తున్నారు. మొగ్గలు రాకుండా ఉండేందుకు పొలంలో 90 శాతం మొక్కలకు దాదాపు 500 ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు.
source:Eenadu
అమెరికాలోని ఫ్లోరిడాలో బుధవారం ప్రయోగించిన నాసా మూన్ రాకెట్ ‘ఆర్టెమిస్-1’ నుంచి కనిపిస్తున్న భూగోళం.
source:Eenadu
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులోకి 12 టీఎంసీలను నింపారు. దీంతో నిండు కుండలా మారిన ప్రాజెక్టు చూపర్లను ఆకట్టుకుంటోంది.
source:Eenadu
కీసర నుంచి ఈసీఐఎల్‌కి వెళ్లే ఆర్టీసీ బస్సులో బుధవారం ఓ విద్యార్థి ప్రమాదమని తెలిసినా వెనకాల పైన అంచు పట్టుకొని నిలబడి ప్రయాణించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమంలో వైరలయ్యింది. ‘ప్రాణంతో చెలగాటం అవసరమా...’ అంటూ పలువురు వాపోయారు.
source:Eenadu
మెదక్ జిల్లాలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం నుంచి మిల్లుల్లో ధాన్యం దింపే వరకు రైతులదే బాధ్యత. ధాన్యం రవాణా చేసే లారీల డ్రైవర్లు బస్తాకు రూ.10 వసూలు చేస్తున్నారు. దీంతో రైతులే ట్రాక్టర్లను కిరాయికి తీసుకొని తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు.
source:Eenadu
ఛార్జింగ్ అయిపోవడంతో బ్యాటరీ ఆటో కూకట్‌పల్లిలో రోడ్డు మధ్యలో ఆగింది. అటుగా వెళ్తున్న మరో బ్యాటరీ ఆటో డ్రైవర్ వెనక నుంచి కాలితో నెడుతూ వెళ్లడం కనిపించింది.
source:Eenadu
కూకట్‌పల్లిలోని చిత్తారమ్మ దేవాలయం వడ్డేపల్లి ఎన్‌క్లేవ్ చౌరస్తా వద్ద నిత్యం ఉదయం, సాయంత్రం భారీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. నియంత్రణ లేక ఏ వాహనం ఎటు పోతుందో తెలియని పరిస్థితి.
source:Eenadu