చిత్రం చెప్పే విశేషాలు!

(18-11-2022/1)

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరిట నిర్మిస్తున్న సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ సందర్శించారు. కొద్ది నెలల్లోనే అందుబాటులోకి రానుంది.

source:Eenadu

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాత్రి వేల విద్యుత్తు కాంతుల్లో వెలుగుతున్న సరికొత్త ఫొటోను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు గురువారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

source:Eenadu

హుస్సేన్‌సాగర్‌ చెంత ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ట్రయల్‌ రన్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 19, 20వ తేదీల్లో జరిగే రేస్‌లో పాల్గొనే కార్లు గురువారం హుస్సేన్‌సాగర్‌ తీరానికి చేరాయి. 30 పైనే కార్లను తీసుకొచ్చారు.

source:Eenadu

విజయవాడలోని పాల ప్రాజెక్టు వద్ద నిర్మించిన చనమోలు వెంకట్రావు పై వంతెనపై మొక్కలు మొలిచాయి. ప్రస్తుతం వేర్లు బయటకు చొచ్చుకుని పెద్దవవుతున్నాయి. ఇలాగే వదిలేస్తే వంతెన గోడలు బీటలు వారే ప్రమాదం ఉంది.

source:Eenadu

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంటి నిండా మొక్కలు పెంచి హరిత శోభితం చేశారు.. తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయ అర్చకస్వామి పద్మనాభం. తిరుపతి పొర్లవీధిలో ఉండే ఈ ఇల్లు ఆ వీధిలో కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. వీధి మొత్తానికి పచ్చదనంతో ఉండే ఇల్లు ఇది ఒక్కటే కావడం విశేషం.

source:Eenadu

నెల్లూరు జిల్లా కొరిమెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం లోపల వరండా శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. దాని కింద విద్యార్థులు రాకపోకలు సాగిస్తే ప్రమాదాలు జరగవచ్చనే ముందుజాగ్రత్తతో దాన్ని ఏర్పాటు చేశారు.

source:Eenadu

హైదరాబాద్‌ నగరం చుట్టూ 158 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) వెంబడి పచ్చదనం అభివృద్ధికి హెచ్‌ఎండీఏ 71.51 లక్షల మొక్కలు నాటింది. వాటికి బిందు సేద్యంతో నీటి సౌకర్యం కల్పిస్తూ.. స్కాడా సాఫ్ట్‌వేర్‌ ఆటోమేషన్‌తో నిర్వహిస్తున్నారు.

source:Eenadu

హైదరాబాద్‌లోని ఎస్బీహెచ్‌-బీ కాలనీ కోదండ రామాలయంలో కోటి దీపోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. అత్యంత వైభవంగా శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

source:Eenadu

ఇప్పటికే రాత పరీక్ష ఉత్తీర్ణులై మలి విడత నిర్వహించే శారీరక సామర్థ్య తదితర పరీక్షలకు కఠోర సాధన చేస్తున్నారు కానిస్టేబుల్‌ అభ్యర్థులు. భాగ్యనగరంలోని విక్టోరియా మెమోరియల్‌ మెట్రో స్టేషన్‌ మెట్లను గెంతుతూ ఎక్కుతుండగా తీసిన చిత్రమిది.

source:Eenadu

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం గోప్లాపూర్‌ శివారులో సుమారు 25 ఎకరాల్లో విస్తరించిన ఊరగుట్ట (మల్లన్న గుట్ట) పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. 1995లో వాటర్‌షెడ్‌ పథకంలో భాగంగా ఊరగుట్టపై వేల సంఖ్యలో మొక్కలు నాటారు.

source:Eenadu

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ పంట పొలాల్లో నారు పోసి దీనికి రక్షణగా మహిళల చీరలు అడ్డుగా చుట్టారు కొందరు రైతులు. ఒకటి కాదు రెండు కాదు చాలా పొలాలకు ఇలానే చుట్టి ఉంచారు. పశువులు పొలాల్లోకి రాకుండా ఉండేందుకు ఇలా ఏర్పాట్లు చేసుకున్నారు.

source:Eenadu

గమనిక: ఇది ప్రయత్నించకండి

బాక్సర్‌ మీనాక్షి

ఈవీఎంలు ఇలా పుట్టుకొచ్చాయి!

Eenadu.net Home