చిత్రం చెప్పే విశేషాలు!
(19-11-2022/1)
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును శుక్రవారం దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, ఆయన సతీమణి కల్పనా దాస్.
source:Eenadu
జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడుస్తున్న కార్గిల్ యుద్ధ వీరుడు నాయక్ దీప్‌చంద్.
source:Eenadu
మూడేళ్ల తర్వాత నగరంలో జరుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్ అభిమానులకు కొత్త జోష్ తెచ్చింది. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన మూడు మ్యాచ్‌లనూ ఆస్వాదించారు. నటుడు సుడిగాలి సుధీర్ వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నాడు.
source:Eenadu
రూట్స్ కొలీజియం గ్రాడ్యుయేషన్, ఫ్రెషర్స్ డే-2022 వేడుకలను శుక్రవారం అమీర్‌పేటలోని గ్రీన్‌పార్క్ మ్యారీగోల్డ్ హోటల్‌లో నిర్వహించారు.ఫ్రెషర్స్ డే సందర్భంగా మిస్టర్ అండ్ మిస్ ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసి సన్మానించారు.
source:Eenadu
బోడుప్పల్‌లోని బొమ్మకు శాంతమ్మ గార్డెన్ సమీపంలో మినీ వ్యాన్‌పై యువకుడు నిల్చొని ప్రమాదకరంగా ప్రయాణించాడు. ట్రాఫిక్ పోలీసులు అలాంటి వాహనాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
source:Eenadu
విశాఖపట్నంలోని రుషికొండ వద్ద తవ్వకాలు వివాదాస్పదంగా మారాయి. అక్కడ కడుతున్న నిర్మాణాలపైనా ఎన్నో సందేహాలు రేగుతున్నాయి. తవ్వకాలు సాగిన ప్రాంతంలో రాళ్లు, మట్టి కిందికి జారకుండా ఇనుప వల ఏర్పాటు చేసే పనులు జోరుగా సాగుతున్నాయి. అటుగా వెళ్లేవారు ఆసక్తిగా చూస్తున్నారు.
source:Eenadu
అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్‌లోని హొల్లంగిలో నిర్మించిన తొలి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం. ప్రధాని మోదీ దీన్ని శనివారం ప్రారంభించనున్నారు.
source:Eenadu
ప్రపంచంలోనే అత్యంత పొడవైన మీసాలు కలిగిన గిర్ధర్ వ్యాస్‌తో రాజస్థాన్ బికానేర్‌లోని జునాగఢ్ కోటలో ఫొటో దిగుతున్న విదేశీ పర్యాటకురాలు.
source:Eenadu
కార్తిక మాసోత్సవాల సందర్భంగా సనత్‌నగర్ హనుమాన్ దేవస్థానం ఆవరణలోని మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు రిపుంజయ్‌శర్మ పర్యవేక్షణలో స్వామివారికి వక్కలతో ప్రత్యేక అలంకారం నిర్వహించారు.
source:Eenadu
తెలంగాణ కశ్మీరంగా పిలిచే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉట్నూరు - జన్నారం మార్గమధ్యలో కవ్వాల్ అభయారణ్యంలో కురుస్తున్న మంచును చీల్చుకుంటూ వస్తున్న సూర్యకిరణాలు కనువిందు చేస్తున్నాయి.
source:Eenadu
విశాఖ, అరకు ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొదరు ప్రకృతి నడుమ అడవుల్లో కొండలపై గడపాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసమే సరికొత్త తరహా గుడారాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని వాహనాలపైనా, నేలపైనా ఏర్పాటు చేసుకోవచ్చు.
source:Eenadu