చిత్రం చెప్పే విశేషాలు!
(21-11-2022/2)
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొన్నారు.
Source: Eenadu
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు పెద్దశేషవాహనంపై శ్రీ వైకుంఠ నారాయణుడి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
Source: Eenadu
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా చిన్నారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘శాకుంతలం’ చిత్రబృందం ఈ పోస్టర్ విడుదల చేసింది. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన ఈ ప్రేమకావ్యంలో అర్హ నటిస్తోంది.
Source: Eenadu
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిమిత్తం గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో అడుగుపెట్టారు. మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’కు కాస్త విరామం ఇచ్చి రాహుల్ ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
Source: Eenadu
రాష్ట్రంలో రైతుల సమస్యలు, ధరణి లోపాలు పరిష్కరించాలని కోరుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
Source: Eenadu
ఈ చిత్రం చూసి కారును ఫోమ్ వాష్ చేస్తున్నారనుకుంటున్నారేమో.. అలా అయితే మీరు తప్పులో కాలేసినట్లే..! డెన్మార్క్‌లోని తూర్పు జట్లాండ్‌లో భారీగా కురుస్తున్న మంచు కారును ఇలా కప్పేసింది.
Source: Eenadu
మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక్ స్కూల్ డైమండ్ జూబ్లీ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టోర్నడో బృందానికి చెందిన సైనికులు ద్విచక్రవాహనాలపై ఆకట్టుకునే విన్యాసాలు చేశారు.
Source: Eenadu
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ప్రపంచ మత్స్య దినోత్సవం పురస్కరించుకొని పలువురు సీఎంను సభావేదికపై మత్స్యకారుల టోపీ, వలతో సత్కరించారు.
Source: Eenadu
న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో టీ20 మ్యాచ్ కోసం భారత జట్టు నేపియర్ చేరుకుంది. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్ ఇలా అక్కడి రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించారు.
Source: Eenadu