చిత్రం చెప్పే విశేషాలు!

(22-11-2022/1)

కార్తిక సోమవారం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అమరావతి, కోటప్పకొండకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు చేశారు. పలు దేవాలయాల్లో శివపార్వతులకు కల్యాణోత్సవం జరిపారు. సాయంత్రం ఆలయ ప్రాంగణాల్లో దీపోత్సవం నిర్వహించారు.

source:Eenadu

ప్రస్తుతం ప్రపంచమంతా ఫిఫా ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఓ మిఠాయి దుకాణం ఇలా ప్రపంచకప్, ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారులైన మెస్సీ, రొనాల్డోలను పోలిన కేక్‌ను రూపొందించి వినియోగదారులను ఆకర్షిస్తోంది.

source:Eenadu

కార్తిక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఉభయ పశ్చిమలో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆయా ప్రాంతాల్లోని దేవాలయాల్లో శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

source:Eenadu

శ్రీశైలం ఆలయం.. శివపార్వతుల వేషధారణలో దీపారాధన.

source:Eenadu

హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతూ చలి తీవ్రత ఎక్కువవు తోంది. నిత్యం ఉదయం ఎనిమిది గంటలైనా మంచు తెరలు వీడడం లేదు. ఖైరతాబాద్‌లో జనాలు చలిమంట కాచుకుంటున్న చిత్రమిది.

source:Eenadu

ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం తాంసి (కె) శివారు అటవీప్రాంతంలో మేతకు వెళ్లిన పశువుల మందపై పులి పంజా విసిరింది. పులి గాండ్రింపులు వినిపించడంతో బేస్‌ క్యాంపు సిబ్బంది ఇలా చెట్లు ఎక్కి వాటి కదలికలను గమనిస్తున్నారు.

source:Eenadu

పుంగనూరులో కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా లక్ష దీపోత్సవం నిర్వహించారు. దీపాలతో పట్టణంలోని కల్యాణ వేంకటరమణస్వామి ఆలయ పుష్కరిణి కొంగొత్తశోభను సంతరించుకుంది. హిందూజాగరణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

source:Eenadu

అమీన్‌పూర్‌ చెరువులో క్యాట్‌ఫిష్‌.. చిన్న చేపలను తినేస్తున్నాయి. చేపలు క్యాట్‌ఫిష్‌ ధాటికి మృత్యువాతపడుతున్నాయి. ఈ విషయమై సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధికారి సతీష్‌ను వివరణ కోరగా.. నీరు ఎండిపోయే వరకు ఏమీ చేయలేని పరిస్థితి అని పేర్కొన్నారు.

source:Eenadu

అమెరికాలోని న్యూయార్క్‌ ఎరీ కౌంటీ ఆర్చర్డ్‌పార్క్‌ పట్టణంలో మంచులో చిక్కుకుపోయిన కారు.

source:Eenadu

కొలంబియాలోని మెడెల్లిన్‌లో సోమవారం ఓ చిన్న విమానం ఇళ్లపై కూలిపోవడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలమైన భవనాల వద్ద అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

source:Eenadu

బద్దలైన అగ్నిపర్వతం..

చిత్రం చెప్పే విశేషాలు!(04-12-2022/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(04-12-2022/1)

Eenadu.net Home