చిత్రం చెప్పే విశేషాలు!

(23-11-2022/1)

అక్రమార్కుల చేతుల్లో కొండలు సైతం కరిగిపోతున్నాయి. యథేచ్ఛగా మట్టి తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరం సమీపంలో ఉన్న కొండ.. మట్టి తవ్వకాలతో రూపుకోల్పోయింది. సుమారు పది కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ కొండ మరో రుషికొండను తలపిస్తోంది.

source : eenadu

మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి.. గ్లోబల్‌ గిఫ్ట్‌ ఫౌండేషన్‌లో భాగస్వామురాలైన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. పారిస్‌లో తాజాగా జరిగిన ది గ్లోబల్‌ గిఫ్ట్‌ గాలా ఎడిషన్‌లో ఆమె భారత్‌ తరఫున పాల్గొన్నారు.

source:eenadu

ప్రమాదంలో ఎవరైనా రోడ్డుపై పడిపోయి ఉంటే సాటివారి పట్ల మానవత్వం చూపించని రోజులివి. కానీ శునకం మాత్రం సాటి కుక్క చనిపోతే ఎంతగానో చలించింది. గుంటూరు శివారులోని నాయుడుపేటవద్ద జాతీయ రహదారిపై వాహనం ఢీకొని కుక్క చనిపోయింది. మరో కుక్క వచ్చి ఆ కళేబరం వద్ద చాలాసేపు ఉంది.

source:eenadu

మన్యంలో వర్షాకాలంలోనే కాదు, ప్రతిరోజు జలపాతాలు నీటితో ఉరకలేస్తున్నాయి. హుకుంపేట మండలంలో సుమారు 10 గ్రామాల్లో జలపాతాలు ఉన్నాయి. సరసపాడు వద్ద పెదబయలు జలపాతాలు అందాలు ఇట్టే కట్టిపడేస్తున్నాయి. పర్యాటకులు స్నానాలుచేస్తూ సరదాగా గడుపుతున్నారు.

source:eenadu

అనంతపురం జిల్లా రాయదుర్గంలోని కోట నగరేశ్వరస్వామిని మాస శివరాత్రిని పురస్కరించుకొని ఎండుఫలాలతో అలంకరించారు.

source:eenadu

కోనసీమ గ్రామాల్లోని పొలాల్లో కలుపు పెరిగి, బీడువారి పోయాయి. వాటిని సాగులోకి తెచ్చేందుకు రైతులు శ్రమించాల్సివస్తోంది. మంగళవారం ఉప్పలగుప్తం మండలంలోని వాడపర్రులోని ఓ రైతు నారుమడి కోసం దమ్ము చేస్తున్న సమయంలో ట్రాక్టరు చక్రాలు దిగబడి ప్రమాదకరంగా పైకిలేచాయిలా.

source:eenadu

వాయుగుండం ప్రభావంతో సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో ఓడలరేవు జెట్టీ వద్ద వివిధ ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు తమ బోట్లను నిలిపివేశారు.

source:eenadu

వెల్దుర్తి- డోన్‌ మార్గంలోని రైల్వే గేటు మార్గంలోని పట్టాల మధ్య కంకర రాళ్లు అధికంగా వేయడంతో ఆటోలు ముందుకు కదల్లేని పరిస్థితి. రాళ్ల మధ్య ఇరుక్కుపోవడంతో ఆటోను ప్రయాణికులు కిందకు దిగి తోస్తున్నారు. ఆటోలు నిలిచిపోవడంతో ఇతర వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

source:eenadu

చిత్రం చెప్పే విశేషాలు!(27-11-2022/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(27/11/2022/1)

భారత రాజ్యాంగం అమలు ఎలా జరిగిందంటే...!

Eenadu.net Home