చిత్రం చెప్పే విశేషాలు!

(24-11-2022/1)

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం కొడాలి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు గుమ్మడి ఫణి.. పెరట్లో భారీ సొరకాయ కాసింది. వారణాసి నుంచి తెచ్చిన నాటు విత్తనాన్ని రెండు నెలల క్రితం పెరట్లో నాటారు. అది ఏకంగా 5.5 అడుగుల పొడవు పెరిగి అందరినీ అబ్బురపరుస్తోంది.

source:eenadu

తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలంలో ఒకవైపు పులులు భయపెడుతుంటే.. మరో వైపు చలి వణికిస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు నమోదైన మండలం ఇది. చలిని తట్టుకోలేక మూగజీవాలపై దుప్పట్లు వేసి అక్కడే చలిమంటలు వేస్తున్నారు.

source:eenadu

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ సియాంగ్‌ జిల్లా బిరు గ్రామం స్వర్ణోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పెమా ఖాండూ ఇలా ప్రత్యేక ఆహార్యంతో దర్శనమిచ్చారు.

source:eenadu

దారుణ హత్యకు గురైన ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు మంగళవారం ఉద్యోగ విధుల్లో ఉన్న చివరి క్షణాలివి. పోకలగూడెం బీట్‌ పరిధిలో కూలీలకు సూచనలిస్తున్న ఈ చిత్రాన్ని అధికారులు బుధవారం విడుదల చేశారు.

source:eenadu

మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామానికి చెందిన వెన్న మధుసూదన్‌రెడ్డి గుర్రంపై ఉన్న మక్కువతో దానిని కొనుగోలు చేసి శివుడిగా నామకరణం చేశారు. 7 నెలల క్రితం రూ.20వేలతో ఓ గుర్రాన్ని కొని స్వారీ చేస్తున్న మధుసూదన్‌రెడ్డిని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

source:eenadu

బుధవారం హనుమకొండ అశోకా జంక్షన్‌ నుంచి రాంగ్‌ రూట్‌లో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు.. ట్రాఫిక్‌ పోలీసులు, నిఘా నేత్రాల నుంచి తప్పించుకునేందుకు ఇలా వాహన నంబరు ప్లేట్‌కు పేపర్‌ చుట్టి తిరుగుతూ కనిపించాడు.

source:eenadu

సహజంగా మొక్కజొన్న మొక్కకు రెండు కణుపుల వద్ద రెండు పొత్తులు వస్తాయి. కూనవరం మండలం టేకులబోరులోని ఓ ఇంటి ఆవరణలో మొక్కజొన్న మొక్కకు ఒకే ప్రాంతంలో మూడు పొత్తులు వచ్చాయి. దీన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు.

source:eenadu

అనంతపురం మండలం కాట్నేకాలువ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. అడుగుకో గుంతతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home