చిత్రం చెప్పే విశేషాలు!

(25-11-2022/1)

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలోని శ్రీశైలం ప్రధాన రహదారిపై.. ఫర్హాబాద్‌-వట్వర్లపల్లి మధ్య బుధవారం పెద్దపులి రోడ్డు దాటుతూ ప్రయాణికులకు కనిపించింది. వారు సెల్‌ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.

source:eenadu

ప్రజలకు ఆహ్లాదం కలిగించేందుకు ఏర్పాటు చేసిన నెల్లూరు నగరవనాన్ని అందుబాటులోకి తెస్తామని అధికారులు ప్రకటించారు. త్వరలో ప్రారంభమయ్యే ఈ వనంలో వివిధ రకాల జంతువులు, పక్షుల బొమ్మలను జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు.

source:eenadu

చూడటానికి కారులా కనిపిస్తోంది. తిప్పడానికి స్టీరింగ్‌ ఉంది. లోపలికి వెళ్లితే తెలుస్తోంది ఇది సైకిల్‌ అని... గుంటూరు ఎంబీటీఎస్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు పి.రంజిత్‌కుమార్, ఎం.హేమంత్, ఎస్‌కే జోగిశ్వరరావులు ఈ వినూత్నమైన ప్రాజెక్టు రూపొందించారు.

source:eenadu

బాపట్ల మండలం సూర్యలంక అటవీ భూముల్లో సాలీడు గూడుపై మంచు కురిసి ముత్యాల హారంలా మెరిసిపోతూ చూపరులను విశేషంగా ఆకర్షించింది. ఈ మనోహర దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది.

source:eenadu

గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గురువారం జరిగిన సాంస్కృతిక ఉత్సవాల్లో మంత్రి రోజా నృత్యం చేశారు. కళాకారులతో కాలు కదిపి అందరినీ అలరించారు.

source:eenadu

ఆగస్టు 29న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమైన పెద్దపల్లి సమీకృత పాలనా సౌధం(కలెక్టరేట్‌) సందర్శించే వారికి ఓ దృశ్యం కట్టిపడేస్తోంది. మెట్ల పక్కన ఉంచిన రెండు ఎద్దుల బండ్లు(కచ్చురాలు) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

source:eenadu

సిరిసిల్ల పట్టు ఖ్యాతిని చాటేలా హైదరాబాద్‌ నుంచి సిరిసిల్ల వెళ్లే మార్గంలో శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ (బాహ్య వలయ రహదారి) కూడలిలో చేనేత కార్మికులు వాడే ‘కండెలు’ ఇలా ఏర్పాటు చేశారు. ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

source:eenadu

భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోతే ఎవరికీ ఇబ్బందులు కలగకుండా వాహనాలు సాఫీగా సాగేలా చేసే ట్రాఫిక్‌ ప్రత్యేక బైకు ఇది. వైజంక్షన్‌ వద్ద నోపార్కింగ్‌ ప్రాంతంలో కాలిబాటపై కనిపించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎడాపెడా జరిమానాలు వేసే ట్రాఫిక్‌ పోలీసులకు అవి వర్తించవేమో మరి!

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home