చిత్రం చెప్పే విశేషాలు..! (29-09-2022/1)

పాలకులు పట్టించుకోకపోవడంతో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని తాళ్లూరు రైతులే సొంతంగా చందాలు వేసుకొని ర.భ రోడ్డు దగ్గర నుంచి 650 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు రోడ్డు ఏర్పాటు పనులు ప్రారంభించారు. పొక్లెయినరుతో పంట కాలువ తీశారు.

Image:Eenadu

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కోతుల గుంపులను చూస్తే ప్రజలు వణికిపోతున్నారు. బుధవారం ఉదయం గుడిహత్నూర్‌ వెళ్లే జాతీయ రహదారిపై ఓ కోతుల గుంపు వరుసగా కూర్చొని ఉంది. అటుగా వెళ్లే ద్విచక్ర వాహనదారులు వాటిని చూసి బెదిరిపోయారు.

Image:Eenadu

నిజామాబాద్‌ నుంచి బాన్సువాడ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు నిజామాబాద్‌ నుంచి చందూరు శివారు వరకు సుమారుగా 20 కి.మీ. పరిధిలో 200 వరకు గుంతలు ఏర్పడ్డాయి. పలుచోట్ల రహదారి కోతకు గురైంది. రోడ్డును బాగుచేయాలని స్థానికులు కోరుతున్నారు.

Image:Eenadu

పెద్దేముల్‌ మండలంలోని ఆత్కూరు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహం చెట్ల పొదల మధ్యన దర్శనమిస్తోంది. విగ్రహ ఏర్పాటు కోసం స్థలం కేటాయించకపోవడంతో తెచ్చి ఇలా వదిలేశారు.

Image:Eenadu

గుంటూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గుంటూరు నగరంలోని పలు రహదారులు జలమయమయ్యాయి. ఎటుచూసినా రహదారులు చెరువులను తలపించాయి. పెదకాకాని, పొన్నూరు, తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం, కొల్లిపర తదితర మండలాల్లో వర్షం కురిసింది.

Image:Eenadu

అనంతపురంలోని ఆజాద్‌ నగర్‌లో దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. నగరంలోని ఐదో రోడ్డు పెద్దమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి ప్రతిమను భక్తులు కరెన్సీ నోట్లతో అలంకరించారు.

Image:Eenadu

గాజువాక వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. 11 కిలోల పత్తిని ఉపయోగించి అయిదుగురు అర్చకులు, 16 మంది మహిళలు సుమారు 7 గంటల పాటు శ్రమించి కలువ పువ్వుల మాదిరిగా దండలు సిద్ధం చేసి అమ్మవారికి అలంకరణ చేశారు.

Image:Eenadu

పుట్టగొడుగులు సాధారణంగా పైన గొడుగులా ఉండి కింద కాండం ఉంటుంది. పెదగొల్లలపాలెంలో ఓ పుట్టగొడుగు వలయాకారంలో అందంగా ఉంటూ కనువిందు చేస్తోంది. బుడగ మాదిరిగా ఉంటూ పైనున్న గొడుగు నుంచి కింది కాండం వరకు వల వేసినట్లు కనిపిస్తోంది.

Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home