చిత్రం చెప్పే విశేషాలు!

(26-11-2022/1)

నానక్‌రాంగూడ బౌల్డర్‌ హిల్స్‌ గోల్ఫ్‌ అండ్‌ కంట్రీ క్లబ్‌లో శుక్రవారం ఫ్యాషన్‌ డిజైన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ఫ్యాషన్‌ షోలో రూపదర్శినులు ర్యాంప్‌ వాక్‌ చేసి అలరించారు. సినీ నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్‌ ర్యాంప్‌పై షో స్టాపర్‌గా తళుక్కుమన్నారు.

source:Eenadu

ఐటీ కారిడార్‌లో కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ఊపందుకున్నాయి. అందుకు నిదర్శనమే ఈ చిత్రం. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లే, తిరిగి ఇంటికి వచ్చే సమయాల్లో రద్దీ పెరిగి గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌పై ఇలా కార్లు బారులు తీరుతూ కన్పిస్తున్నాయి.

source:Eenadu

భారత్‌ జోడో యాత్రలో బాక్సింగ్‌ ఒలింపిక్‌ విజేత విజేందర్‌ సింగ్‌తో కలిసి మీసం మెలేస్తున్న రాహుల్‌ గాంధీ.

source:Eenadu

ఏపీలోని అనకాపల్లి జిల్లా మునగపాకలోని పేటకట్టు మూల ప్రాంతంలో రైతు పి.నూకరాజు పొలంలో బొప్పాయి చెట్లు ఏపుగా పెరిగాయి. దాదాపు 34 అడుగుల ఎత్తు పెరిగిన రెండు చెట్లకు అయిదేళ్లుగా పుష్కలంగా కాయలు కాస్తున్న వీటికి సేంద్రియ ఎరువులు మాత్రమే ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.

source:Eenadu

విశాఖ నగరంలో శుక్రవారం ఆకస్మికంగా కురిసిన వర్షానికి ప్రధాన మార్గాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పలు చోట్ల భూగర్భ డ్రైనేజీల మ్యాన్‌హోళ్లు పొంగడంతో ఆ ప్రాంతాల్లో ప్రజలు హడలిపోయారు.

source:Eenadu

పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని కోవెలగుట్లపల్లి కాజ్‌వేపై మూడు నెలలుగా నీరు ప్రవహిస్తుండటంతో నాచుపట్టింది. కోవెలగుట్లపల్లి నుంచి పుట్టపర్తికి గ్రామస్థులు, పాఠశాల విద్యార్థులు నిత్యం కాజ్‌వేపై వెళ్లాల్సిందే. ప్రమాదవశాత్తు జారితే చిత్రావతి నదిలోకి పడతారు.

source:Eenadu

నెల్లూరు జిల్లాను మంచు దుప్పటి కప్పేస్తోంది. ముఖ్యంగా వేకువజామున నుంచి ఉదయం 9గంటల వరకు దట్టంగా అలుముకొంటోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని చంద్రబాబునగర్‌ నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే రోడ్డుపై శుక్రవారం ఉదయం 7.30 సమయంలో పరిస్థితి ఇది.

source:Eenadu

బురదదాటితేనే బడికి..! విశాఖపట్నంలోని చంద్రంపాలెం ఉన్నత పాఠశాల మైదానంలో విద్యార్థుల అవస్థలు.

source:Eenadu

సినీనటి, ప్రముఖ నర్తకి శోభన తన నృత్యాభినయంతో కళాభిమానులను కట్టిపడేశారు. శుక్రవారం సాయంత్రం మాదాపూర్‌ శిల్పకళావేదికలో లోటస్‌ ఫీట్‌ బై శోభన పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె తన బృందంతో కలిసి భరతనాట్య నృత్యాంశాలను ప్రదర్శించారు.

source:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home