చిత్రం చెప్పే విశేషాలు!
(28-11-2022/1)
విశాఖ ఆర్కేబీచ్, రుషికొండ తీరాలకు పర్యాటకులు ఆదివారం భారీగా తరలివచ్చారు. ఆర్‌కేబీచ్‌లో నావికాదళ దినోత్సవ ఏర్పాట్లను ఆసక్తిగా తిలకించారు.
source:Eenadu
‘జగన్ మామా.. ఉపాధ్యాయులు లేరు మామా’ అంటూ పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగులలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఇద్దరు ఉపాధ్యాయులే పదో తరగతి పాఠాలు బోధిస్తుంటే ఎలా చదువుకోవాలంటూ ప్లకార్డులతో ఆవేదన వ్యక్తం చేశారు.
source:Eenadu
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం.. భక్తులు కాలినడకన మహారాష్ట్రలోని పర్బణి నుంచి తిరుపతి చేరుకున్నారు. గత నెల 28న పిల్లలు, పెద్దలతో కలిపి 102 మంది బయలుదేరామని, రోజుకు 30 కి.మీ చొప్పున 870 కి.మీ నడిచి ఆదివారం మధ్యాహ్నం అలిపిరికి చేరుకున్నామని చెప్పారు.
source:Eenadu
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పల్‌గావ్ గ్రామం నుంచి మేడిగూడకు వెళ్లేదారిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభం. ప్రస్తుతం చేలలో రైతులు శనగ పంట సాగు చేస్తున్నారు. ఈ దారిన వస్తూపోతుంటారు. ప్రమాదం జరగకముందే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
source:Eenadu
ఇదేదో చిన్న మొక్కకు పూచిన పువ్వులోంచి సూరీడు నవ్వినట్లుంది కదూ. ఆదివారం సూర్యోదయ సమయంలో ప్రభాకరుడు డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కోడూరుపాడులో ఓ ఇంటిపైన పూల కుండీలోని పుష్పంపైనున్నట్లుగా కనిపించినప్పుడు తీసిన చిత్రమిది.
source:Eenadu
ఈ చిత్రం ఆనందపురం-విశాఖపట్నం మార్గంలోనిది. ద్విచక్ర వాహనంపై చిన్నారిని ఇలా తీసుకెళ్లడం ప్రమాదం కాదా అని చూపరులు ఆందోళన వ్యక్తపర్చారు.
source:Eenadu
జ్యోతిబా ఫులే వర్ధంతిని పురస్కరించుకుని విజయనగరానికి చెందిన శ్రీనివాస ఆర్ట్స్ అకాడమీ ఆదివారం గాజులరేగలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్నారులు ఇలా ఫులే వేషధారణలో అలరించారు.
source:Eenadu
ఉస్మానియా విశ్వవిద్యాలయ సమీప మాణికేశ్వర్ నగర్ ప్రాంతంలోని హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకులో మరుగుదొడ్లను ఇలా తీర్చిదిద్దారు. వాహనదారుల కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన వీటిని చూసి.. టాయిలెట్లు అంటే ఎవరూ నమ్మటం లేదని సిబ్బంది చెప్తున్నారు.
source:Eenadu