చిత్రం చెప్పే విశేషాలు!

(29-11-2022/1)

ముంబయి జుహులోని తన నివాసం జల్సాలో బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌.. తండ్రి హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ రాసిన మధుశాల పుస్తకం ఆకారంలో రాతి బల్ల రూపొందించారు. తండ్రి 115వ జయంతి(ఆదివారం)ని పురస్కరించుకుని అమితాబ్‌ సోమవారం ఈ విశేషాలను పంచుకున్నారు.

source:Eenadu

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వాసి అల్లూరి సరోజకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈనెల 19న జరిగిన పోటీల్లో మిసెస్‌ ఆసియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. 

source:Eenadu

రాత్రివేళ వచ్చే భక్తులకు యాదాద్రి పసిడి వర్ణ కాంతుల్లో పచ్చటి పూలమొక్కల మధ్య, పండు వెన్నెల కురిసే వీధి దీప కాంతుల మధ్య ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. భక్తులకు కనువిందు గొలుపుతోంది. కీసర వైపు నుంచి వచ్చే భక్తులకు సోమవారం యాదాద్రి ఇలా కనిపించింది.

source:Eenadu

విశాఖపట్నం కేజీహెచ్‌లో నిత్యం ఓ స్వచ్ఛంద సంస్థ అన్నదానం చేస్తుంది. ఆసుపత్రికి వచ్చే పేద రోగుల సహాయకులు, బంధువులు ఈ భోజనం కోసం ఉదయం 10.30 గంటల నుంచే వేచి ఉంటారు. అందుకే ఇలా తమతో పాటు తెచ్చకున్న బాక్సులు, ప్లేట్లను వరుసలో పెట్టి వేచి చూస్తుంటారు.

source:Eenadu

పోలీసు ఉద్యోగ పరీక్షల కోసం బడంగ్‌పేట మున్సిపల్‌ మైదానంలో దాదాపు 500 మంది అభ్యర్థులు నిత్యం ఉదయం 5 గంటల నుంచి 9గంటల దాకా కఠోర సాధన చేస్తున్నారు. వీరిలో 200 మంది మహిళా అభ్యర్థులే. వీరి ఇబ్బందుల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్‌ తరఫున సంచార టాయ్‌లెట్‌ సౌకర్యం కల్పించారు.

source:Eenadu

కేపీహెచ్‌బీ నెక్సెస్‌ మాల్‌లో కాందానీ రాజ్‌ధాని హోటల్‌లో వచ్చేనెల 1 నుంచి పలురకాల వంటకాలు ఘుమఘుమలాడనున్నాయి. రాజస్థానీ, గుజరాతీ, ఇతర ఉత్తర భారత వంటకాలు 32 రకాలు అందుబాటులో ఉంచనున్నట్లు హోటల్‌ నిర్వాహకులు తెలిపారు.

source:Eenadu

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం శ్రీలక్ష్మీనారాయణ స్వామి కోనేరులో పెరుగుతున్న తుమ్మ చెట్టుని చూస్తే నిండా తెల్లని పువ్వులు పూసినట్లుగా కొంగలు వాలాయి. చలి తీవ్రతకు ఉదయం 8 గంటలైనా ఎటూ ఎగరకుండా ఇలా చెట్లపైనే ఉండిపోతున్నాయంటూ స్థానికులు చెబుతున్నారు.

source:Eenadu

అమీర్‌పేట్‌లోని ఆస్టర్‌ప్రైమ్‌ ఆసుపత్రి బృందం వైద్య పరికరాలున్న బస్సుతో లక్డికాపూల్‌లో ఉచిత సేవలు అందిస్తున్న చిత్రమిది. తమ బృందం రోజుకో ప్రాంతం వెళ్లి దాదాపు 150మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్‌ విజయచందర్‌ తెలిపారు.

source:Eenadu

హుస్సేన్‌ సాగర తీరాన సాయం సాయంత్ర సమయంలో బంగారు వర్ణ సూర్యకిరణాలు పడుతుండగా.. పక్షుల కిలకిలారావాలు..

source:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home