చిత్రం చెప్పే విశేషాలు!
(30-11-2022/1)
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు వట్టిమల్ల లక్ష్మి వేసిన జొన్న చేనులో మొక్కలు 20 అడుగుల ఎత్తు పెరిగి అందరిని ఆకర్షిస్తున్నాయి. సేంద్రియ పద్ధతిలో పక్షుల కోసం పంటను పండించామని మహిళా రైతు కుమారుడు పూర్ణచందర్ తెలిపారు.
source:eenadu
మంచిర్యాల జిల్లాకు చెందిన మల్లయ్య, శాంతమ్మ దంపతులు ఖమ్మం నగరంలో మైకులో ప్రచారం చేస్తూ, గాడిద పాలు అమ్మారు. చలికాలం శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారు గాడిద పాలు తాగితే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. జండూబామ్ సీసా పరిమాణంలో రూ.200 చొప్పున విక్రయించారు.
source:eenadu
ఈయన పేరు మర్రి గోపాల్‌రెడ్డి. వయసు 80. హనుమకొండ నగరం అడ్వకేట్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వందలాది సంఖ్యలో కలప, టెర్రాకోట్, రాతి శిల్పాలను మలుస్తున్నారు. ఉపాధ్యాయుడిగా 20 ఏళ్ల క్రితమే పదవీ విరమణ చేసిన ఈయన కళాఖండాలను మలచడమే వ్యాపకంగా పెట్టుకున్నారు.
source:eenadu
చుట్టూ పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం.. ఈ ప్రకృతి సోయగాల నడుమ ఓ గిరిజనుడు పూర్తిగా వెదురు కర్రలతో ఒక ఇంటిని నిర్మించుకున్నాడు. మారేడుమిల్లి పంచాయతీ పరిధిలోని కూడూరు గ్రామంలో ఉన్న ఈ నిర్మాణం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
source:eenadu
బొప్పాయి చెట్టుకు కాసిన ఓ కాయ పక్షి ఆకారంలో పలువుర్ని ఆకర్షిస్తోంది. తణుకు పట్టణం పాతవూరుకు చెందిన కాకర్ల రాజేంద్రప్రసాద్ ఇంటి ఆవరణలో బొప్పాయి చెట్టుకు ఈ కాయ ఉండటంతో అటుగా వెళ్లేవారు వింతగా చూస్తున్నారు.
source:eenadu
విశాఖ సాగర్‌నగర్ బీచ్ సమీపంలో ప్రమాదకరమైన అయిదడుగుల సముద్ర పాము మత్స్యకారుల వలకు చిక్కింది. ఈ సర్పం విషపూరితమైనదని మత్స్యశాఖాధికారి డాక్టర్ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. దీనిని మత్స్యకారులు తిరిగి సముద్రంలోకి విడిచిపెట్టారు.
source:eenadu
వర్షాలతో తడిసి ముద్దైన నెల్లూరు జిల్లాను ప్రస్తుతం పొగమంచు కమ్మేస్తోంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహన చోదకులకు దారి సరిగా కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. చలితో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.
source:eenadu
గుంటూరు కలెక్టరేట్ రహదారిలోని మూడు బొమ్మల కూడలిలో చాచా నెహ్రూ విగ్రహం మెడకు ఉరివేసినట్లుగా వైకాపా ఫ్లెక్సీని కట్టారు. మన నాయకులను గౌరవించుకునేది ఇలాగేనా అని నగరవాసులు విమర్శిస్తున్నారు.
source:eenadu