చిత్రం చెప్పే విశేషాలు!
(01-12-2022/1)
పక్షి ప్రేమికులను కనువిందు చేసే విహంగం ఉల్లంకి పిట్ట (కామన్ శాండ్‌పైపర్). పిచ్చుక ఆకారంలో 250- 400 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. చిన్న చేపలు, పురుగులను ఆహారంగా తీసుకుంటుంది. ప్రస్తుతం కొల్లేరులో 4 వేల వరకు ఈ రకం పక్షులు ఉంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.
source:eenadu
విశాఖ సాగర్‌నగర్ సముద్రతీరంలో మత్స్యకారుల వలకు దాదాపు ఒకే పరిమాణంలో ఉన్న కొంగమూతి కదుర్లు చేపలు చిక్కాయి. రుచికరమైన చేపలుగా పేరొందిన వీటిని ఆహారంగా మాత్రమే వినియోగిస్తారని, కిలో సుమారు రూ.150 నుంచి రూ.200 వరకు ధర పలుకుతాయని చెప్పారు.
source:eenadu
ఈ చెట్టు ఆకుపై పేరు రాసుకుంటే సుమారు పదేళ్లపాటు చెక్కు చెదరదు. దీని శాస్త్రీయ నామం క్లూజియా.. రోజియా. దీన్ని ఆటోగ్రాఫ్, సిగ్నేచర్ చెట్టుగా కూడా పిలుస్తుంటారు. పెదవాల్తేరు జీవ వైవిధ్య ఉద్యానవనంలో ఈ ఆటోగ్రాఫ్ మొక్కలను పెంచుతున్నారు.
source:eenadu
విజయవాడ ధర్నాచౌక్.. నిరసన కార్యక్రమంలో ఓ సన్నివేశం జరిగింది.. గుణదల ఎస్సై సత్య శ్రీనివాస్ తన చిన్ననాటి మిత్రుడు తూర్పుగోదావరికి చెందిన సూరిబాబును గుర్తుపట్టారు. పిలిచి ఆప్యాయంగా మాట్లాడారు. తర్వాత అందరితోపాటుగా అతన్ని వ్యానులో పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు.
source:eenadu
ప్రకృతి సోయగాలతో పాటు పూల అందాలు మన్యంలో ఆహ్లాదాన్నిస్తున్నాయి. జైపూర్ కూడలి నుంచి చాపరాయి జలవిహారి వరకు రోడ్డుకు ఇరువైపులా పొద్దు తిరుగుడు పూల తోటలు పర్యటకులను కట్టి పడేస్తున్నాయి. పూల తోటల్లో సెల్ఫీలు తీసుకుంటూ ఆహ్లాదంగా గడుపుతున్నారు.
source:eenadu
కొణిజర్ల మండలం పల్లిపాడు నుంచి ఏన్కూరుకు వెళ్లే బైపాస్ మార్గంలో అంజనాపురం వద్ద దృశ్యమిది. రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడటంతో స్థానికులు కర్రలకు ప్లాస్టిక్ కవర్లు కట్టి ప్రమాద హెచ్చరికగా ఏర్పాటు చేశారు. వాహనదారులు దీన్ని గమనించి జాగ్రత్తగా ప్రయాణం సాగిస్తున్నారు.
source:eenadu
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం చినదొడ్డిగుంటలో నల్ల కోతిపిల్ల సాధారణ కోతిపిల్లతో కలిసి గంతులు వేసింది. రంగంపేట పశు సంవర్ధకశాఖ అధికారి షేక్ జహంగీర్ స్పందిస్తూ.. జన్యుపరమైన లోపాలతో పుట్టిన ఈ కోతిపిల్లకు రంగులో మార్పు వచ్చిందని తెలిపారు.
source:eenadu
కృష్ణా జిల్లా పామర్రులోని బాపూజీపేటలో అంగన్‌వాడీ కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రం ఒకే భవనంలో నడుస్తున్నాయి. ఇళ్ల నుంచి వస్తున్న మురుగు నీటి కాలువ నిర్వహణలోపంతో భవనం చుట్టూ చేరుతోంది. పిల్లలు ప్రమాదవశాత్తూ మురుగులో పడిపోయే ప్రమాదమున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
source:eenadu