చిత్రం చెప్పే విశేషాలు!

(01-12-2022/2)

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోని రూపఖేడి వద్ద సాగుతోంది. యాత్రలో బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ పాల్గొని రాహుల్‌కు సంఘీభావం తెలిపారు.

Source: Eenadu

‘పుష్ప ద రైజ్‌’ ఈ నెల 8న రష్యాలో విడుదల కానుంది. అందులో భాగంగా మాస్కోలో నిర్వహించిన ప్రమోషన్‌ కార్యక్రమంలో అల్లు అర్జున్‌, రష్మిక పాల్గొని సందడి చేశారు.

Source: Eenadu

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ రూపొందించిన వర్చువల్ రియాలిటీ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ ‘లే మస్క్’ను సూపర్‌స్టార్‌ రజనీకాంత్ వీక్షించారు. ఆ ఫొటోను రెహమాన్‌ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు.

Source: Eenadu

 సినీనటి జాన్వీకపూర్‌ తిరుమల శ్రీవారిని దర్శించున్నారు. బుధవారం రాత్రి తన స్నేహితులతో కలిసి కాలినడకన ఆమె తిరుమల చేరుకున్నారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

Source: Eenadu

సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ సినిమాలో పాటలకు జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఈ నేపథ్యంలో చివరి పాట సైతం పూర్తి కావడంతో సల్మాన్‌ఖాన్‌తో కలిసి ఓ ఫొటో తీసుకున్నారు. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Source: Eenadu

ఇటీవల నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన జవహర్‌రెడ్డి గురువారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Source: Eenadu

వధూవరులు తమ వివాహ వేడుకకు ముందు తీరిక చేసుకొని వచ్చి ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టారు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లా జేసర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Source: Eenadu

హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని కల్చరల్‌ సెంటర్‌లో ‘థండర్‌ స్ట్రైక్‌’ నూతన సంవత్సర వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సినీనటులు శివబాలాజీ, మధుమిత దంపతులతో పాటు పలువురు మోడల్స్‌, సోషల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లు పాల్గొన్నారు.

Source: Eenadu

 హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు (23-04-2024/1)

ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ అంటే..

సత్యభామ వచ్చేస్తోంది..

Eenadu.net Home