చిత్రం చెప్పే విశేషాలు!

(02-12-2022/1)

దోమల బెడదను తగ్గించలేని అధికారుల తీరుకు నిరసనగా కౌన్సిలరే పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లి పురపాలిక మొదటి వార్డు కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌ స్వయంగా కాలనీల్లో దోమల మందు పిచికారీ చేశారు.

source:eenadu

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమికి ఈ చిత్రాలే నిదర్శనం. వరంగల్‌ జిల్లా సంగెం మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఒకే ఆవరణలో ఉన్నాయి. పరదా కట్టి ఒకవైపు అయిదు తరగతులు మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.

source:eenadu

నంద్యాల జిల్లా వెలుగోడులోని ఇందిరానగర్‌ ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు కింద వంట గది, శౌచాలయం పనులు జరుగుతున్నాయి. నిర్మాణాలకు క్యూరింగ్ పనులను విద్యార్థులతో చేయిస్తున్నారు. పిల్లలు గోడలపై ఎక్కి ప్రమాదకరంగా నీళ్లు పడుతున్నారు.

source:eenadu

చింతచెట్టు మరో వృక్షానికి చోటివ్వదంటారు పెద్దలు. ఇందుకు భిన్నంగా నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని పార్‌పెల్లితండా నుంచి పార్‌పెల్లి వెళ్లే మార్గంలో చింత చెట్టులో మరో తెల్లమద్ది చెట్టు మొలిచింది. ఈ మార్గంలో ప్రయాణించే వారు దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.

source:eenadu

జీ-20 సదస్సు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 100 చారిత్రక ప్రదేశాల్లో జీ-20 లోగోను ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం చార్మినార్‌ వద్ద లోగోను పురావస్తుశాఖ ప్రదర్శించింది.

source:eenadu


రామడుగు మండలం గోపాల్‌రావుపేట ఉన్నత పాఠశాలను గురువారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆకస్మికంగా సందర్శించారు. ఉపాధ్యాయుడి అవతారమెత్తి తొమ్మిది, పదో తరగతి గదుల్లో పాఠాలు బోధించారు. అనంతరం పాఠశాలలో బయోమెట్రిక్‌ హాజరు నమోదు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు.

source:eenadu

పతంగుల వేడుక రానుంది.. సంక్రాంతికి ముందు నుంచే ధూల్‌పేటలో గాలిపటాల సందడి మొదలైంది. ఇక్కడి పలు కుటుంబాల్లోని చిన్నా పెద్దా పతంగులు, చరకాల తయారీలో నిమగ్నమయ్యారు. కొవిడ్‌తో రెండేళ్లపాటు అంతంతమాత్రంగా సాగిన వ్యాపారంపై ఈసారి కార్మికులు ఆశలు పెట్టుకున్నారు.

source:eenadu

మహంత్‌ హరిదాస్‌జీ ఉదాసీన్‌ ఈ కేంద్రంలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.

source:eenadu

చిత్రం చెప్పే విశేషాలు..!(04-02-2023/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(04-02-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు..!(03-02-2023/2)

Eenadu.net Home