చిత్రం చెప్పే విశేషాలు..! (03-12-2022/1)

కొండ చివరన చిన్న ఆధారంపై కనిపిస్తూ ఆశ్చర్యానికి గురిచేసే ఈ గుండు శ్రీశైలం రహదారిలో వెళ్లేవారికి మామిడిపల్లి వద్ద కనువిందు చేస్తోంది.

#Eenadu

బెంగళూరు నుంచి ఛత్తీస్‌గఢ్‌ తరలిస్తున్న కొత్త ట్రక్‌ ఇది. 18 టైర్ల ట్రాలర్‌ లారీపై 12 టైర్ల ట్రక్‌ను తీసుకెళుతున్న చిత్రం వరంగల్‌ హైవేపై ఘట్‌కేసర్‌ వద్ద శుక్రవారం కనిపించింది.

#Eenadu

సాగర తీరంలో శుక్రవారం నిర్వహించిన నౌకాదళ విన్యాసాలు తూర్పు నౌకాదళం సత్తాను చాటాయి. అందులో భాగంగానే చేపట్టిన అద్భుత విస్పోటం ఇది.

#Eenadu

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల నుంచి రావినూతల వరకు వెళ్లే రోడ్డులో గుంతలు ఎక్కువగా ఉండి తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో రావినూతల ఆటో సంఘం అధ్యక్షుడు కొలకలూరి చిన్న ఆధ్వర్యంలో ఆటో చోదకులు చేతులు కలిపి రోడ్డుపై పడిన గుంతలను మట్టితో పూడ్చివేశారు.

#Eenadu

గుంటూరు జిల్లా వేమూరులో ద్విచక్రవాహనం వెనక బ్యాలెన్స్‌గా నిలబడి ప్రయాణం చేస్తున్న శునకం చూపరులను ఆకట్టుకుంది.

#Eenadu

అస్సాంలోని కరీంగంజ్‌కు చెందిన నూరుల్‌ హక్‌ అనే మెకానిక్‌ నాలుగు నెలలు కష్టపడి తన వద్ద ఉన్న పాత మారుతీ స్విఫ్ట్‌ను రూ.10 లక్షలు ఖర్చు చేసి విలాసవంతమైన లంబోర్గిని కారుగా తయారు చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు దీనిని బహుమతిగా ఇస్తానని నూరుల్‌ పేర్కొన్నారు.

#Eenadu

దర్శకుడు గుణశేఖర్‌ కుమార్తె నీలిమ గుణ, వ్యాపారవేత్త రవి ప్రక్యాల వివాహం శుక్రవారం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వైభవంగా జరిగింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దంపతులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.

#Eenadu

కేపీహెచ్‌బీలో మేయర్‌ విజయలక్ష్మితో కలిసి షటిల్‌ ఆడుతున్న మంత్రి కేటీఆర్‌

#Eenadu

చిత్రం చెప్పే విశేషాలు..!(04-02-2023/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(04-02-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు..!(03-02-2023/2)

Eenadu.net Home