చిత్రం చెప్పే విశేషాలు..! (03-12-2022/2)

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం గవర్నర్‌కు తీర్థప్రసాదాలను అందజేశారు.

#Eenadu

హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్’ అవార్డు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని వరించింది. అమెరికాలో తాజాగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఈ అవార్డు సొంతం చేసుకున్నారు.

#Eenadu

తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హైదరాబాద్‌లోని గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.

#Eenadu

బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12, 2023న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

#Eenadu

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య వన్డే సిరీస్‌ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల కెప్టెన్లు ట్రోఫీని ఆవిష్కరించారు.

#Eenadu

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దివ్యాంగులు ఇచ్చిన సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆసాంతం రంజింపజేశాయి.

#Eenadu

శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.

#Eenadu

తన తండ్రి కృష్ణ మృతి కారణంగా కొన్ని రోజుల విరామం తీసుకున్న మహేశ్‌బాబు తిరిగి షూటింగ్‌లు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న ఆయన ‘బ్యాక్‌ టు వర్క్‌’ అని పోస్టు పెట్టారు.

#Eenadu

చిత్రం చెప్పే విశేషాలు..!(04-02-2023/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(04-02-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు..!(03-02-2023/2)

Eenadu.net Home