చిత్రం చెప్పే విశేషాలు..! (29-09-2022/2)

36వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన డ్రోన్‌షో చూపరులను ఆకట్టుకుంది.

#Eenadu

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ దక్షిణ కొరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి పమన్‌జొమ్‌లో ఉత్తర, దక్షిణ కొరియాలను వేరు చేస్తున్న డీమిలిటరైజ్డ్‌ జోన్‌ను పరిశీలించారు. అనంతరం సైనిక కుటుంబాలతో ఆత్మీయంగా మాట్లాడారు.

#Eenadu

ప్రముఖ సినీనటుడు రానా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.

#Eenadu

గుజరాత్‌లో నేడు 36వ జాతీయ క్రీడలను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రీడాకారులంతా ఒక్కచోట మెరిశారు. పై ఫొటోలో పీవీ సింధు, నీరజ్‌ చోప్రా, అంజు బాబీ జార్జ్‌, మీరాబాయ్‌ చాను, గగన్‌నారంగ్‌లను చూడవచ్చు.

#Eenadu

ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆది పురుష్‌’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ పోస్టర్‌ను శుక్రవారం ఉదయం 7.11గంటలకు, టీజర్‌ను అక్టోబర్‌ 2న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

#Eenadu

ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత హాజరై సందడి చేశారు.

#Eenadu

ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ తన సతీమణి స్నేహారెడ్డి జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకొని ప్రార్థనలు చేశారు.

#Eenadu

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కొంపల్లిలో మల్లారెడ్డి, నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో సైక్లథాన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి ఔత్సాహికులతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులు వేశారు.

#Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home