చిత్రం చెప్పే విశేషాలు!

(06-12-2022/1)

తళతళ మెరుస్తున్న ఈ ఆకృతులన్నీ వృథాగా ఉన్న వాహనాల విడిభాగాలతో తయారు చేసినవే. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 25 మంది లోహ కళాకారులు శ్రమించి బతుకమ్మ, చార్మినార్‌, ఒగ్గుడోలు రూపాల్లో తీర్చిదిద్ది రవీంద్రభారతిలో కొలువు దీరిన ఇవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

source:Eenadu

కొందరు శ్రావ్యంగా పాడారు. మరికొందరు సమ్మోహనంగా డ్యాన్స్‌ చేశారు. వీరంతా యువతీ యువకులే. ఇక హుషారుకు అడ్డేముంది...అందరూ కలిసి యువ జోరేమిటో చూపించారు. తమలోని ప్రతిభతో అలరించారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన ‘ఫ్లాష్‌మాబ్‌’ ఇందుకు వేదికయింది.

source:Eenadu

కడప నగరంలోని పెద్ద దర్గా ఉరుసు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. బుధవారం గంధం, గురువారం ఉరుసు జరగనుంది. విద్యుత్తు దీపాల కాంతుల్లో మెరిసిపోతున్న దర్గాను చిత్రంలో చూడొచ్చు.

source:Eenadu

సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేటలో రూ.10 కోట్లతో తీర్చిదిద్దిన మెట్లబావిని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి కేటీఆర్‌ సోమవారం రాత్రి ప్రారంభించారు. గత ఎనిమిదిన్నరేళ్లలో అనేక ప్రాజెక్టులు అభివృద్ధి చేసినా దక్కని సంతోషం.. ఈ మెట్లబావితో దక్కిందని కేటీఆర్‌ అన్నారు. source:Eenadu

విశాఖలోని కేజీహెచ్‌కు నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఉత్తరాంధ్రతో పాటు...ఉమ్మడి తూగో జిల్లా నుంచి కూడా వచ్చి వైద్య సేవలు పొందుతుంటారు. ఇక్కడ ఓపీ టోకెన్‌ తీసుకోవాలంటే పెద్ద ప్రయాసే. సోమవారం ఓపీ కేంద్రం వద్ద రద్దీని చిత్రంలో చూడొచ్చు.

source:Eenadu

అతిపెద్ద సైన్స్‌ ప్రాజెక్టుల్లో ఒకటిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. 2028 నాటికి ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.

source:Eenadu

శ్రీవారి ఆలయ ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్న ర్రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.

source:Eenadu

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్మిస్తున్న 125 అడుగుల డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెలలో నూతన సచివాలయాన్ని ప్రారంభించబోతున్న తరుణంలో.. అంబేడ్కర్‌ జయంతి రోజు ఈ విగ్రహాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

source:Eenadu

అహ్మదాబాద్‌లోని రాణిప్‌లో ప్రధాని మోదీ, నారన్‌పుర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అమిత్‌ షా.

source:Eenadu

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలోని ప్యాక్స్‌ కొనుగోలు కేంద్రంలో వందల సంఖ్యలో కోతులు ధాన్యం తింటూ అన్నదాతలను హడలెత్తిస్తున్నాయి. కరిచేందుకు యత్నించాయి. నష్టం కలిగిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

source:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home