చిత్రం చెప్పే విశేషాలు!

(07-12-2022/1)

కర్రలపై విద్యుత్తు తీగలు ఏర్పాటు చేసిన ఈ దృశ్యం కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె పంచాయతీ పట్రపల్లి చెరువు సమీపంలోనిది. వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు సరఫరా చేసేందుకు ఇలా ఏర్పాటు చేశారు. నేలకొరిగి ఏదైనా ప్రమాదం జరుగుతుందని స్థానికులు భయపడుతున్నారు. 

source:Eenadu

అల్లూరి జిల్లాలోని మేఘాలకొండ మంచు అందాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మంగళవారం వేకువ జామున పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి చేరుకున్నారు. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.

source:Eenadu

ఒక్కోసారి వాహనాలపై ప్రయాణం చేసే వారి తీరు చూస్తే భయమేస్తుంది. వారికేం అవుతుందోనని కంగారుపడతాం. మంగళవారం ఉదయం పెదవాల్తేరు రోడ్డులో ద్విచక్ర వాహనంపై బాలుడిని నిల్చోపెట్టి ప్రమాదకరంగా తీసుకువెళ్లారు. 

source:Eenadu

ట్రాఫిక్‌ నిబంధనలు పోలీసు వాహనాలకు వర్తించవా.. ఈ చిత్రం చూస్తే అదే నిజమనిపిస్తోంది. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు నంబరు ప్లేట్లను తొలగించి, స్టిక్కర్లు వేసిమరీ ప్రయాణిస్తున్నారు. శిరస్త్రాణం ఉండటం లేదు. సామాన్యులకైతే ఈ పాటికి చలాన్ల మోత మోగేదే..

source:Eenadu

అమీర్‌పేట-గొల్లూరు రోడ్డుపై ధాన్యంలో తేమ శాతం తగ్గించేందుకు రైతులు రోడ్లపై రోజుల తరబడి ఆరబెడుతున్నారు. రాత్రివేళల్లో మంచు పడకుండా కుప్పలుగా చేసి, వాటిపై పట్టాలు కప్పి రాళ్లు అడ్డుగా పెడుతున్నారు. చీకట్లో కనిపించక వాహనదారులు నేరుగా వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నారు. 

source:Eenadu

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ మెట్రో గిన్నిస్‌ రికార్డు సాధించింది. ఇది వార్ధా రోడ్‌ ప్రాంతంలో ఉన్న 3.14 కిలోమీటర్ల డబుల్‌ డెకర్‌ వయాడక్ట్‌ మెట్రో.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నిర్మాణంగా గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని మహా మెట్రో ఎండీ బ్రిజేష్‌ దీక్షిత్‌ తెలిపారు.

source:Eenadu

మానవత్వాన్ని మరిచి అమానవీయంగా ప్రవర్తిస్తున్న సంఘటనలను రోజూ చూస్తూనే ఉన్నాయి. కానీ హృదయాకారంలో ఉన్న ఈ బోన్సాయ్‌ వృక్షం.. మనుషులకే కాదు.. మాకూ మనసు ఉంటుందని చెబుతున్నట్లుగా ఉంది. నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లోని అగ్రి-హర్టికల్చర్‌ సొసైటీలో ఈ చిత్రం కనిపించింది.

source:Eenadu

హైదరాబాద్‌లో భిక్షాటన ధోరణి మారుతోంది. దానం చేయడానికి చిల్లర లేదా.. మరేం ఫరవాలేదు.. మా వద్ద ఫోన్‌ పే, గూగుల్‌ పే లాంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయంటున్నారు యాచకులు. కొంతమంది హిజ్రాలైతే ఇలా చెల్లించేంత వరకు వదలడం లేదు. లక్డీకాపూల్‌లో కనిపించిన దృశ్యం.

source:Eenadu

చెన్నై మహా నగరానికి ప్రత్యామ్నాయంగా కాంచీపురం జిల్లా పరందూరు పరిసర ప్రాంతాల్లో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయంపై భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం దీని నిర్మాణానికి చకచకా పావులు కదుపుతోంది.

source:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home