చిత్రం చెప్పే విశేషాలు!

(08-12-2022/1)

అడివి శేష్‌ కథానాయకుడిగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించిన ‘హిట్‌ 2’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. విజయయాత్రలో భాగంగా చిత్రబృందం రాజమహేంద్రవరం వెళ్లింది. జ్ఞాపకం కోసం అక్కడి కళాశాల విద్యార్థులతో నటీనటులు, దర్శకుడు ఇలా సెల్ఫీ తీసుకున్నారు.

source:Eenadu

రంగాపూర్‌ బస్టాండ్‌ ప్రాంగణంలో ద్విచక్ర వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ప్రయాణికులు రోడ్లపై నిలబడాల్సి వస్తోంది. రోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు చూస్తున్నా పట్టించుకోవడం లేదు.

source:Eenadu

విశాఖ సాగర తీరాన బుధవారం రెండు విభిన్న జీవులు కనిపించాయి. సముద్రంలో చాలా లోపల ఉండే కప్ప జాతుల్లో ఇవి ఒకటని, వీటిని పఫర్‌ ఫిష్‌ అంటారని మత్స్యశాఖాధికారి డాక్టర్‌ పి.శ్రీనివాసరావు తెలిపారు. 

source:Eenadu

హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న రేసింగ్‌ లీగ్‌కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. గ్యాలరీ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రేసర్లకు, కార్లకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కార్మికులు టైర్లు అడ్డుగా పెడుతున్నారు.

source:Eenadu

ఇసుకతిన్నెల అందాలను కళ్ల ముందుకు చేర్చారు.. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో బుధవారం జరిగిన ‘టైమ్స్‌ ఫ్యాషన్‌ వీక్‌’ ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకుంది. ప్రదర్శనలో మిస్‌ ఫెమినా ఇండియా సిని శెట్టి షో స్టాపర్‌గా నిలిచారు. ప్రదర్శన గురువారం సైతం కొనసాగనుంది.

source:Eenadu

ఔషధ గుణాలున్న వేప చెట్లు మళ్లీ జీవం కోల్పోతున్నాయి. గతేడాది కొమ్మలు ఎండిపోయినా కొన్ని రోజుల తరువాత చిగురించాయి. వేపకు ఆపద రావడానికి కారణాన్ని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలను స్థానికులు కోరుతున్నారు. నల్లచెరువు-మాడ్గుల మార్గంలో కనిపించిందీ చెట్టు.

source:Eenadu

రాజస్థాన్‌లోని దారాలో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ నేతలు సచిన్‌ పైలట్‌, రణ్‌దీప్‌ సుర్జేవాలా.

source:Eenadu

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించేందుకు ‘వారాహి’ రూపంలో వాహనం రూపుదిద్దుకొంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, దాడులు చేసినా తట్టుకునేలా కట్టుదిట్టంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని తయారుచేశారు.

source:Eenadu

కొల్లేరుకు వచ్చే అందాల అతిథి స్పాట్‌ బిల్డ్‌ పెలికాన్‌. స్థానికంగా దీనిని గూడబాతు అని పిలుస్తారు. ఇది 4 నుంచి 6 కిలోల వరకు బరువు ఉంటుంది. ఫిలిప్పీన్స్‌ దేశంలో పుట్టిన ఈ పక్షి మనదేశంతో పాటు శ్రీలంక, కంబోడియా, దక్షిణ తూర్పు ఆసియాలో మాత్రమే నివాసం ఉంటాయి. 

source:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home