చిత్రం చెప్పే విశేషాలు!

(09-12-2022/1)

తిరుపతి ఆటోనగర్‌ నుంచి రేణిగుంటకు వెళ్లే మార్గంలో భూగర్భం నుంచి వెళ్లే మురుగు నీటి పైపులైను లీకవుతూ.. మట్టి కోతకు గురై భారీ గొయ్యి ఏర్పడింది. సుమారు 20 మీటర్ల పొడవున రోడ్డు కుంగిపోయింది. నెల కిందట చిన్నగా ఉన్న గొయ్యి.. క్రమంగా విస్తరించిందని స్థానికులు తెలిపారు.

source:eenadu

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నుంచి పెనుకొండ, అనంతపురానికి వెళ్లే ప్రధాన రహదారి వర్షాలకు కోతకు గురై భారీ గుంతలు పడ్డాయి. కర్ణాటక సరిహద్దు మురారాయనపల్లి వద్ద రోజూ లారీలు ఇరుక్కుపోతున్నాయి. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మురళి, యువకులు నిరసన తెలియజేశారు.

source:eenadu

ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందిస్తున్న ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు అలీ.

source:eenadu

పాల్వంచ పట్టణ ప్రజలను వేధిస్తున్న వానరాల బెడద నుంచి ఉపశమనం కల్పించేందుకు పాల్వంచ పారిశ్రామికవాడలైన కేటీపీఎస్‌ కాలనీల్లో అధికారులు ఓ వ్యక్తి సాయంతో కొండముచ్చును తిప్పుతున్నారు. కొద్దిరోజులుగా కాలనీల్లో కోతుల సంచారం తక్కువైందని ప్రజలు తెలిపారు.

source:eenadu

జూరాల జలాశయం వద్ద పక్షుల సందడి నెలకొంది. ఏటా శీతాకాలంలో ప్రధాన నీటి వనరుల చెంతకు వలస వచ్చే పెయింటెడ్‌ స్టార్క్‌ కొంగలతోపాటు నల్లముక్కు కొంగలు, ఇతర పక్షులు గుంపులుగా వచ్చి చేరుతున్నాయి. గూళ్లు అల్లుకొని సేదతీరుతున్నాయి. ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి.

source:eenadu

దట్టమైన అరణ్యంలో ఔషధ గుణాలున్న చెట్ల బెరడులు, ఆకులు తాకుతూ జాలువారుతున్న తలకోన జలపాతం సందర్శకులకు కనువిందు చేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీతలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కడ స్వీయ చిత్రాలు తీసుకుంటూ, ఈత కొడుతూ ఆనందంగా గడుపుతున్నారు.

source:eenadu

కరీంనగర్‌ పట్టణంలో మాతా శిశు ఆకృతిలో ఉన్న గ్రీనరీ నమూన, పూలతో అందంగా తీర్చిదిద్దడంతో ఆ ప్రాంతవాసులను ఆకట్టుకుంటుంది.

source:eenadu

ఔటర్‌ కూడళ్ల సుందరీకరణలో భాగంగా హైదరాబాద్‌-సాగర్‌ రహదారిలోని బొంగుళూరులో తీగ మొక్కలతో ఏర్పాటు చేసిన బుద్ధుడి ఆకృతి ఇది. తుది మెరుగులు దిద్దుతున్నారు.

source:eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home