చిత్రం చెప్పే విశేషాలు!
(10-12-2022/1)
మైండ్‌స్పేస్ వద్ద శంకుస్థాపన పూజల్లో సీఎం కేసీఆర్, మేయర్ విజయలక్ష్మి, కేశవరావు తదితరులు..
source:Eenadu
మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసి సందడి చేశారు. అమీర్‌పేట లో శుక్రవారం మంగళ గౌరి సిల్క్స్ నూతన షోరూంను ఆమె ప్రారంభించారు.
source:Eenadu
భాగ్యనగరంలోని ధూల్‌పేటలో ఓ ఇంటి ప్రహరీని చీల్చుకుని మరీ కొన్నేళ్లుగా రావి చెట్టు పెరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ రోడ్డులో వెళ్లే వాహనదారులకు ఇది ప్రమాదకరంగా ఉంది.
source:Eenadu
చెట్లపై నివాసాలు ఉండటం అడవుల్లో లేదా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో చూస్తుంటాం. నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ వ్యక్తి తన ఇంటి ముందున్న చెట్టుపై ఇలా మంచెలా ఏర్పాట్లు చేసుకోవడం ఆకట్టుకుంటోంది.
source:Eenadu
ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత 7 డిగ్రీలుగా నమోదైంది. మధ్యాహ్నం 12 అయినా చలి తీవ్రత తగ్గలేదు. శుక్రవారం ఉదయం తరగతి గదిలో పాఠాలు వినే పరిస్థితి లేకపోవడంతో గుడిహత్నూర్ మండలంలో గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో అన్ని తరగతులను ఆరుబయట ఎండలోనే నిర్వహిస్తున్నారు.
source:Eenadu
కాకతీయ మెడికల్ కాలేజీ మైదానం డీజే సౌండ్‌లతో దద్దరిల్లింది. కాకతీయ మెడికల్ కాలేజీ వార్షికోత్సవం, మెడికోఫెస్ట్ ఉత్కర్ష-22 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం కళాశాల మైదానంలో డీజేనైట్, ఫ్యాషన్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు.
source:Eenadu
అస్సాంలోని గోలాఘాట్ వద్ద శుక్రవారం వరిచేను గట్టుపై కూర్చొని కూలీలతో కలిసి ‘పొమెలొ’ సలాడ్ తింటున్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.
source:Eenadu
కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇది. 44 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాలలో ఇటీవల మూత్రశాల గోడ కూలడం, రేకులను దొంగలు ఎత్తుకెళ్లడంతో ఉపాధ్యాయులు ఆ ప్రాంతంలో పరదాలు కట్టారు. ఆ పరదాల చాటునే నిత్యం బాలికలు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోంది.
source:Eenadu
యువత నృత్యాలు.. వాటిని తిలకిస్తూ తోటి విద్యార్థుల కేరింతలతో కృష్ణా విశ్వవిద్యాలయంలో సందడి నెలకొంది. కృష్ణాతరంగ్ పేరిట రెండు రోజుల పాటు యువజనోత్సవాలు నిర్వహిస్తున్నారు.
source:Eenadu
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు వెళ్లే వారికి బస్సు కష్టాలు తప్పడం లేదు. కాలేజీకి వెళ్లేందుకు సరిపడా బస్సులు లేకపోవడంతో లోపల కిక్కిరిసిపోవడమే కాదు.. బయట ఇలా ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణిస్తున్నారు. కొత్తపేటలో కనిపించిన దృశ్యాలివి.
source:Eenadu