చిత్రం చెప్పే విశేషాలు..!

(11-12-2022/1)

అసలే పల్లెవెలుగు బస్సు. కుయ్యో.. మొర్రోమంటూ వెళ్తున్న అది కాస్తా ఇలా కూరుకుపోయింది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలోని తాత్కాలిక ఆర్టీసీ బస్టాండులో పరిస్థితి ఇదీ!

source:eenadu

కొండల మధ్య నుంచి నదీ ప్రవాహాన్ని తలపిస్తూ వరి చేలు ఉన్న ఈ చిత్రం పార్వతీపురం మన్యం జిల్లాలోనిది. గుమ్మలక్ష్మీపురం మండలంలోని గోరటి ప్రాంతం కొండలకు నిలయం. ఇక్కడ సమీపంలో నివాసం ఉంటున్న గిరిజన రైతులు గిరుల మధ్య ఖాళీ ప్రాంతాలను మడులుగా మార్చి వరి పంట వేశారు.

source:eenadu

ఇక్కడ తెల్లటి పూలతో కనువిందు చేస్తున్నది పూతోట కాదు. కొడంగల్‌ ప్రాంతంలో సాగు చేసిన వాము పంట. వర్షాకాలం ముగిసిన తర్వాత పంటసాగు చేపట్టారు. మేలు రకమైన వాముకు మర్పల్లి, నవాబ్‌పేట, మోమిన్‌పేట మండలాల్లోని నేలలు ప్రసిద్ధి. ప్రస్తుతం ఈ పంట పూత దశలో ఉంది.

source:eenadu

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామాను డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షం బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ (బీఎన్పీ)కి చెందిన వేలాది కార్యకర్తలు శనివారం ఢాకాలో మహా ర్యాలీ నిర్వహించారు.

source:eenadu

కేరళలోని శబరిమల ఆలయానికి శనివారం పోటెత్తిన భక్తులు.

source:eenadu

అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తీవ్రంగా మంచు కురుస్తోంది. రహదారులన్నీ హిమంతో నిండిపోతున్నాయి. ఈ క్రమంలో అలస్కాలో మంచులో కూరుకుపోయిన ఓ కారు.

source:eenadu

సుందరంగా.. సందర్శకుల మనసులు దోచుకొనేలా విద్యుద్దీప కాంతులతో పునరుద్ధరించిన సికింద్రాబాద్‌ పరిధి బన్సీలాల్‌పేట మెట్లబావి.. అంధకారంగా మారింది. ప్రారంభించిన ఐదు రోజులకే ఈ పరిస్థితి నెలకొనడంతో సందర్శకులు ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వచ్చింది. source:eenadu

చూడగానే గంపలు, తట్టలు కుప్పగా ఉంచినట్లు అనిపిస్తున్నా... ఇవన్నీ ఒక జీపుపై వేసినవి. హుకుంపేట వారపు సంతకు శనివారం వచ్చిన కాయగూరలు విక్రయించగా, మిగిలిన ఖాళీ గంపలు, తట్టలు ఇవి. జీపు ప్రయాణమైతే కదిలే గంపల గుట్టగా కనిపించి చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది.

#eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home