చిత్రం చెప్పే విశేషాలు!
(12-12-2022/1)
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ ఆసుపత్రి వద్ద గత ప్రభుత్వం అన్న క్యాంటీన్‌ను నిర్మించింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక దాన్ని మూసివేసిం వార్డు సచివాలయంగా మార్చింది. దాతలు తమ సేవా పథాన్ని కొనసాగిస్తున్నా అన్నార్తులు కూర్చొని తినేందుకు స్థలం లేకుండా పోయింది.
source:eenadu
మొక్కకు ఒక రంగు పూలు పూస్తేనే ఆ అందం ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాంటిది కొమ్మ కొమ్మకో వర్ణం వికసిస్తే ఇక పక్కకు చూడలేం కదా! అలాంటి మొక్క తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో తైవాన్ నుంచి తెప్పించిన బొగన్‌విల్లా మొక్క నవరత్నాలు పొదిగినట్లు 9 రంగుల్లో పూస్తోంది.
source:eenadu
జి. మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతంలో పర్యాటకులు సందడి చేశారు. జలపాతంలో స్నానాలు చేస్తూ ఆనందంగా గడిపారు.
source:eenadu
తిరుమల ఘాట్‌రోడ్డు వెంబడి రాళ్లు జారి పడుతున్నాయి. తుపాను కారణంగా వర్షాలతో మట్టి కొట్టుకుపోవడంతో రాళ్లు పడుతున్నట్లు భక్తులు తెలిపారు.
source:eenadu
మాండౌస్ తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు తిరుపతి జై భీమ్‌నగర్ కాలనీలోని ఇళ్లలో నీరు చేరడంతో ఇంట్లో ఉన్నవస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి వర్షం లేకపోవడంతో తడిసిన బియ్యం, సర్టిఫికెట్లు, పుస్తకాలను ఆరబెట్టుకుంటూ కాలనీవాసులు కన్పించారు.
source:eenadu
పంటలకు మద్దతు ధర డిమాండ్ చేస్తూ ఆదివారం హరియాణాలోని సోనిపట్‌లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పంచాయత్‌లో పాల్గొన్న అన్నదాతలు.
source:eenadu
కాజీపేట రైల్వేస్టేషన్ ఎదుట వాహనాలు నిలుపకూడదు. ఒకవేళ నిలిపితే ఆర్పీఎఫ్ పోలీసులు ఇలా గొలుసు చుట్టి తాళం వేస్తున్నారు. స్టేషన్‌లోకి వెళ్లి వచ్చేసరికి గొలుసుతో కట్టిన తమ వాహనాలను చూసి అవాక్కవుతున్నారు. ఇదేమిటంటే రాంగ్ పార్కింగ్ అని జరిమానా కట్టాలంటున్నారు.
source:eenadu
గోడ మీద ఉన్న ఉడతకు నేలపై పాపడ్ కన్పించింది. చుట్టూ జనమున్నా పరుగున వచ్చి దాన్ని నోట కరిచి అటుఇటు చూసి ఆనక తుర్రుమంది. ఖమ్మంలోని టీఎన్జీవో భవన్‌లో ఆదివారం కన్పించిన ఈ దృశ్యాన్ని ‘ఈనాడు’ తన కెమెరాలో బంధించింది.
source:eenadu