చిత్రం చెప్పే విశేషాలు..! (30-09-2022/2)

దసరా, బతుకమ్మ పండగలకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఇలా కిక్కిరిసి కనిపించింది. విశాఖపట్నం, విజయనగరం మీదుగా వెళ్లే హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగిలో కాస్త స్థలం కోసం ప్రయాణికులు ఎగబడుతూ కనిపించారు.

Image:Eenadu

తిరుమలలో శుక్రవారం ఆకాశం మేఘావృతమై ఉండటంతో శ్రీవారి ఆలయం ఇలా మేఘాల కడలి ఒడ్డున ఉందా అన్నట్లు అందంగా కనిపించింది.

Image:Eenadu

మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ఉద్యమ కాలం నాటి తన ఫొటోలను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఈ సెప్టెంబర్‌తో తాను ప్రజాసేవలోకి వచ్చి 16 ఏళ్లయినట్లు తెలుపుతూ పోస్టు పెట్టారు. తెలంగాణ ప్రజలు, కార్యకర్తలు తనకు, పార్టీకి ఇస్తున్న మద్దతు గొప్పదని తెలిపారు.

Image:Eenadu

హైదరాబాద్‌ హైటెక్‌సిటీలోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్లో ‘ద గ్రాండ్‌ దివాలీ బజారియా’ పేరుతో సూత్ర ఎగ్జిబిషన్‌ ఏర్పాటైంది. సినీనటి, వ్యాఖ్యాత వర్షిణి సౌందరరాజన్‌ ఈ ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడళ్లు, ఫ్యాషన్‌ ప్రియులు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Image:Eenadu

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన ‘కార్తికేయ-2’ సినిమా యూఎస్‌లోని థియేటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ వేడుకల్ని నిర్వహించారు. కార్యక్రమంలో చిత్ర నిర్మాత విశ్వప్రసాద్‌ పాల్గొన్నారు.

Image:Eenadu

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన సతీమణి శోభతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Image:Eenadu

ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని కలుపుర్ నుంచి దూరదర్శన్‌ కేంద్రం స్టేషన్‌ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు.

Image:Eenadu

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి.

Image:Eenadu

అహ్మదాబాద్‌లో జాతీయ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ భేటీ అయ్యారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఈ భేటీలో పాల్గొన్నారు.

Image:Eenadu

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారు సర్వభూపాల వాహనంపై ఆలయ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home