చిత్రం చెప్పే విశేషాలు..! (01-10-2022/1)
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సముద్రంలోపల నీటిలో బొమ్మల ప్రదర్శన ఏర్పాటైంది. వీజీపీకి చెందిన కళాకారుల బృందం సముద్ర జీవరాశులకు హాని కలకుండా బొమ్మలను అలంకరించారు.
Image:Eenadu
ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాల విలీనం సందర్భంగా రష్యా రాజధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద శుక్రవారం నిర్వహించిన సంబరాలకు భారీగా తరలివచ్చిన ప్రజలు.
Image:Eenadu
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్ బ్రాహ్మణవాడలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శుక్రవారం మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని రూ.5,55,55,555 విలువైన కరెన్సీతో అలంకరించారు.
Image:Eenadu
ఇయన్ హరికేన్ బీభత్సం కారణంగా ఫ్లోరిడా రాష్ట్రంలోని ఫోర్ట్ మయర్స్ తీరంలోకి కొట్టుకొచ్చిన పడవలు.
Image:Eenadu
దేశంలోనే తొలిసారిగా నగరంలో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ కారు రేసింగ్ కోసం నెక్లెస్ రోడ్డులో 2.8 కిమీ. మార్గం అనుకూలంగా ఉండటంతో హెచ్‌ఎండీఏ అధికారులు ట్రాక్ నిర్మాణం మొదలుపెట్టారు.
Image:Eenadu
ప్లాస్టిక్ వ్యర్ధాలు మూగజీవాలకు ఎంత హానికరమో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఆహారం కోసం ప్లాస్టిక్ డబ్బాలో తలదూర్చిందో శునకం. తిన్నాక డబ్బాలో నుంచి తల బయటకు రాక అవస్థలు పడుతోంది. హయత్ నగర్‌లో కనిపించిన చిత్రమిది.
Image:Eenadu
శంషాబాద్ నర్కూడ సమీపంలోని అమ్మపల్లి దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి బతుకమ్మ వేడుకలు జరిగాయి. అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తర్వాత కోనేరులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
Image:Eenadu
బతుకమ్మ సంబురాలు ఊరూవాడా ఉత్సాహంగా సాగుతున్నాయి. హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ కమిషనరేట్‌లో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో అవిభక్త కవలలు వీణ, వాణి పాల్గొన్నారు.
Image:Eenadu