చిత్రం చెప్పే విశేషాలు..! (01-10-2022/2)

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర నర్సాపూర్‌ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె ముంతాయిపల్లి తండా వద్ద పొలం దున్నుతున్న రైతును కలిసి కష్టాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె సైతం నాగలితో దుక్కి దున్నారు.

Image:Eenadu

టెస్లా సంస్థ.. తాము తయారు చేసిన హ్యూమనాయిడ్‌ రోబో ‘ఆప్టిమస్‌’ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. ఈ సందర్భంగా రోబో వేదికపై చేతులు ఊపి సందడి చేసింది. రానున్న కొన్నేళ్లలో దీన్ని పూర్తిస్థాయి రోబోగా తీర్చిదిద్ది మార్కెట్లోకి తేనున్నట్లు ఎలాన్‌ మస్క్‌ తెలిపారు.

Image:Eenadu

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్ లలిత్‌ శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఎ.వి.ధర్మారెడ్డి ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు.

Image:Eenadu

కూకట్‌పల్లికి చెందిన నాయినేని శ్రీవైష్ణవి, శ్రీనైనా బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా బంగారు బతుకమ్మను తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమ తాత సీహెచ్‌ జనార్ధనరావు పండగ కానుకగా దీన్ని ఇచ్చినట్లు వారు తెలిపారు.

Image:Eenadu

ఒంగోలులో శనివారం భారీవర్షం కురిసింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం జలమయమై వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

Image:Eenadu

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్మ అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Image:Eenadu

దసరా పండగ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో గౌలిగూడలోని మహాత్మా గాంధీ బస్‌స్టాప్‌ సందడిగా కనిపించింది.

Image:Eenadu

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా, క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ నెల 17 నుంచి మరో షెడ్యూల్‌ మొదలు కానున్ననేపథ్యంలో చిత్రబృందం వర్క్‌షాప్‌ నిర్వహించగా.. పవన్‌కల్యాణ్‌ వివిధ సన్నివేశాల గురించి క్రిష్‌తో చర్చించారు.

Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home