చిత్రం చెప్పే విశేషాలు..! (24-09-2022/1)

కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయ ప్రధాన రాజగోపురంపై శుక్రవారం సాయం సంధ్య వేళ సూర్యబింబం చేసిన విన్యాసాలు అబ్బురపరచాయి. అస్తమయం అవుతున్న సూర్యుడు కొన్ని నిమిషాల తేడాలో రాజగోపురంలోని 5 అంతస్తుల గవాక్షాల నుంచి తన కిరణాలను ప్రసరిస్తూ కనువిందు చేశాడు.

Image:Eenadu

శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ శుక్రవారం కరీంనగర్‌లోని మహాశక్తి దేవాలయంలో అమ్మవారి దీక్ష స్వీకరించారు.

Image:Eenadu

చెన్నై వేప్పేరిలోని ఓ పెట్‌ ఫుడ్‌ దుకాణంలో ఉంచిన సంచిపై ఉన్న పిల్లి బొమ్మలను నిజమైనవి అనుకొని వాటివంకే తదేకంగా చూస్తున్న పిల్లి.

Image:Eenadu

ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం విద్యుత్తు కాంతుల్లో మెరిసిపోతున్న కనకదుర్గమ్మ ఆలయం Image:Eenadu

సినీనటి కేథరిన్‌ ట్రెస నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో తళుక్కుమంది. పట్టణంలో ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్‌ మాల్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించింది. కేథరిన్‌ను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలిరావటంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.

Image:Eenadu

చుట్టూ పచ్చని పరిసరాలు.. మధ్యలో నుంచి దూసుకెళ్తున్న రైలు చూస్తే ఇదెక్కడో ఊటీ లేదా అరకు అనుకుంటే పొరపాటే. ఇది మన వరంగల్‌ నగరంలోనిదే. సికింద్రాబాద్‌ నుంచి దిల్లీకి వెళ్లే రైలు మార్గం. కాజీపేట మెట్టుగుట్ట పైనుంచి చూస్తే పచ్చదనంతో ఇలా ఆకట్టుకుంటుంది.

Image:Eenadu


అనకాపల్లి జిల్లాలోని కశింకోటలో సినీనటి డాలీషా సందడి చేశారు. స్థానిక దుర్గమాంబ అమ్మవారి పండగను పురస్కరించుకొని ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఆమె విచ్చేశారు.

Image:Eenadu

హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో ఈ ఆదివారమే అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ను నెల రోజుల కిందటే ఖరారు చేసినా స్టేడియంలో పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టున్నాయి. ప్రేక్షకులు కూర్చొనేందుకు వీల్లేకుండా అక్కడక్కడ కుర్చీలు విరిగి పడిపోయాయి.

Image:Eenadu

భారీ వర్షాల కారణంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో పూర్తిగా నీట మునిగిన కార్లు.

Image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home