చిత్రం చెప్పే విశేషాలు..!

(16-12-2022/2)

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా చిత్రబృందం ఈ పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

Source: Eenadu

1971లో పాక్‌తో జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుగా భారత్‌ ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్‌ను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానం వద్దనున్న అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.

Source: Eenadu

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం మరో ఘనత సాధించింది. జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను విడుదల చేసింది.

Source: Eenadu

నల్గొండలోని ఓ హోటల్‌ వద్ద వినియోగదారులను ఆకర్షించేలా ఇలా కారు బొమ్మతో హోటల్‌ పేరును రాసి ఉంచారు. ఇది ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారిని విశేషంగా ఆకర్షిస్తోంది.

Source: Eenadu

లాస్‌ ఏంజెలెస్‌లోని అకాడమీ మ్యూజియంలో ‘బాబిలోన్‌’ సినిమా ప్రీమియర్స్‌ను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆ సినిమా నటి మార్గట్‌ రోబీ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu

ఖమ్మం జిల్లాలోని పాలేరులో వైతెపా కార్యాలయ నిర్మాణానికి ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు, మహిళలు, యువతను ఆర్థికంగా అభివృద్ధి చేసే సర్కారును స్థాపిస్తామని తెలిపారు.

Source: Eenadu

బీఎస్‌ఎఫ్‌ సైనికులు అవదేశ్‌ సింగ్‌, సుధాకర్‌ 12అడుగుల 9 ఇంచుల ఎత్తైన నిచ్చెన పైనుంచి ద్విచక్రవాహనాన్ని నడిపారు. 2గంటల 21 నిమిషాల 48 సెకనుల పాటు 81.5కిలోమీటర్ల దూరం ప్రయాణించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు.

Source: Eenadu

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరి శ్రేయస్సు గురించి స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home