చిత్రం చెప్పే విశేషాలు..!
(18-12-2022/1)
మార్గశిర మాసోత్సవాల నేపథ్యంలో కనకమహాలక్ష్మికి శనివారం విశాఖలో నిర్వహించిన రథయాత్ర కనుల పండువగా సాగింది. అంబికాబాగ్ రామాలయం నుంచి కనకమహాలక్ష్మి కోవెల వరకూ ఈ యాత్ర నిర్వహించారు.
#Eenadu
విజయ్ దివస్‌ను పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులో తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా (టాస) ‘సదరన్ స్టార్ విజయ్ రన్’ సందడిగా సాగింది. శనివారం ఉదయం రన్ ఫర్ సోల్జర్స్.. రన్ విత్ సోల్జర్స్ పేరుతో 12.5కే (జనరల్), 5కే (పిల్లలు), 4కే (మహిళలు) విభాగాల్లో పరుగు నిర్వహించారు.
#Eenadu
ఓవైపు శుభకార్యాలు.. మరోవైపు వారాంతం కావడంతో శనివరం నగరంలో వాహనాలు కదల్లేని పరిస్థితి. ఫిల్మ్‌నగర్ ప్రధాన రహదారిలో ట్రాఫిక్ స్తంభించింది. అయినా ఆ ప్రాంతంలో ఒక్క ట్రాఫిక్ పోలీస్ కూడా కనిపించలేదని వాహనదారులు ఆరోపించారు.
#Eenadu
దుండిగల్‌లోని భారత వాయుసేన అకాడమీలో లోహ విహంగాలతో పైలెట్లు చేసిన విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా సాగాయి. మొదటి దశ శిక్షణ పూర్తిచేసుకున్న వేర్వేరు బ్రాంచ్‌లకు చెందిన ఈ సందర్భంగా గంటపాటు వైమానిక విన్యాసాలు నిర్వహించారు. సారంగ్ హెలిక్యాప్టర్ల విన్యాసాలు చిత్రంలో చూడొచ్చు.
#Eenadu
గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం నిర్వహించిన ప్రదర్శనలో ఆకట్టుకుంటున్న ఆభరణాలతో రూపొందించిన జాతీయ చిహ్నం.
#Eenadu
గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం నిర్వహించిన ప్రదర్శనలో ఆకట్టుకుంటున్న ఆభరణాలతో రూపొందించిన పార్లమెంట్ భవనం నమూనాలు. రూట్జ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ సంస్థ వీటిని తయారు చేసింది.
#Eenadu
బషీర్‌బాగ్‌లో ఓ ఆటో ట్రాలీలో ఇద్దరు పిల్లలు ఇలా ప్రమాదకరంగా కనిపించారు. అధిక లోడుతో వెళ్తున్న వాహనంలో ఎలాంటి జాగ్రత్తలు లేకున్నా నిర్లక్ష్యంగా ప్రయాణించారు.
#Eenadu
హైదరాబాద్ శివారు ఉప్పల్‌లోని శిల్పారామం శనివారం రాత్రి 777 మంది సామూహిక నృత్య ప్రదర్శనకు వేదికైంది. ఇంటర్నేషనల్ కర్నాటిక్ మ్యుజీషియన్స్ అండ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మహిషాసుర మర్దిని’ స్తోత్రానికి అనుగుణంగా సామూహిక నృత్యాన్ని ప్రదర్శించారు.
#Eenadu