చిత్రం చెప్పే విశేషాలు!
(10-01-2023/1)
అమెరికా, కెనడా దేశాల్లో ఎక్కువగా పండించే జుకినీ కూరగాయను మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతు కందాడి అశోక్‌రెడ్డి ప్రయోగాత్మకంగా సాగు చేశారు. కిలో ధర రూ.150 నుంచి 200 వరకు ఉంటుందని తెలిపారు.
source : eenadu
ఎల్బీనగర్‌ను సిగ్నల్ రహిత కూడలిగా మార్చాలన్న లక్ష్యం అతి త్వరలో నెరవేరబోతోంది. హయత్‌నగర్ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌వైపు వెళ్లే పైవంతెన నిర్మాణం పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటోంది. సంక్రాంతి తర్వాత ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
source : eenadu
ఉద్యోగులు సమయపాలన పాటించేలా వారి హాజరు నమోదుకు మహబూబ్‌నగర్‌లోని నూతన సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో వారం కిందట బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేశారు. వెయ్యి మందికి పైగా ఉన్న ఉద్యోగులకు ఐదే పరికరాలు ఉండటంతో ఉదయం 11.30 గంటలైనా ఇలా బారులు తీరి కనిపించారు.
source : eenadu
విశాఖ సాగర్‌నగర్ ప్రాంతాల్లో సోమవారం కెరటాల తీవ్రత బాగా తగ్గి సముద్రం వెనక్కి మళ్లిన దృశ్యాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో సాధారణ రోజుల కంటే సుమారు 100 అడుగులకు పైగా వెనక్కి వెళ్లింది. దీన్ని సందర్శకులు ఆసక్తిగా వీక్షించారు.
source : eenadu
విశాఖలోని ఎంవీపీ డబుల్ రోడ్డులోని ఓ భవన ప్రహరీలో నుంచి బొప్పాయి మొక్క పెరిగింది. గోడలో నుంచి బయటకు దూసుకువచ్చినట్లు ఉండటంతో అటుగా వెళ్లే వారిని ఆకర్షిస్తోంది.
source : eenadu
విశాఖ సాగర్‌నగర్ సమీప సముద్రంలో మత్స్యకారుల వలకు సోమవారం ఓ పెద్ద జెల్లీ ఫిష్ చిక్కింది. సముద్ర జలాల్లో చాలా లోపల సంచరించే ఈ జీవులు చిన్న చేపల్ని వేటాడే క్రమంలో ముందుకొచ్చిన సందర్భాల్లో వలకు లభ్యమవుతాయని జాలర్లు పేర్కొన్నారు.
source : eenadu
జీడీనెల్లూరు నుంచి పాలసముద్రానికి వెళ్లే మార్గంలో పచ్చదనంతో కూడిన చెట్లు వాహన చోదకులను ఆకట్టుకుంటున్నాయి. వీటి మధ్యలో రోడ్డుపై కెళ్లే వాహన చోదకులు ఈ సుందర దృశ్యాన్ని చూసి ఆనందిస్తున్నారు.
source : eenadu
పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మార్పు రావడం లేదు. హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ రోడ్డులో ట్రాఫిక్ మధ్యలో ఆటో నుంచి వస్తున్న పొగ.. ఇతర వాహనదారులకు ఇబ్బందికరంగా కనిపించింది.
source : eenadu