చిత్రం చెప్పే విశేషాలు

(31-03-2023/1)

ప్రతికూలతలను అధిగమిస్తే విజయం తథ్యమనేందుకు నిదర్శనమీ దృశ్యం. నరికేసిన చెట్టు వాడిపోయింది. అయినా కొంతకాలనికి చిగురించి కొత్త జీవం పోసుకుంటోంది.నిర్మల్‌ జిల్లా కేంద్రం శివారులో సెయింట్‌ థామస్‌ పాఠశాల సమీపంలో కనిపించిన చిత్రమిది.

Source:Eenadu

ఆస్కార్‌ పురస్కారాన్ని సాధించిన భారతీయ లఘుచిత్రం ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ నిర్మాత గునీత్‌ మోంగా, దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్‌లు గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని వారికి అభినందనలు తెలిపారు.

Source:Eenadu

విశాఖపట్నం-ఆనందపురం రోడ్డులో వేములవలస సమీపంలో ఓ ప్రైవేటు అతిథిగృహంపై తీగజాతికి చెందిన మొక్కలు మొన్నటి వరకు పచ్చగా ఉండగా.. ఇటీవల ఆ మొక్కలకు పూసిన పసుపు పూలతో ఇలా ఆకర్షణీయంగా మారింది. Source:Eenadu

శ్రీరామనవమి సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య సరయూ నదిలో గురువారం పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు.

Source:Eenadu

కర్నూలు జిల్లాలోని మద్దికెరలో గురువారం తోపుడు బండ్లలో నీటి బిందెలు, క్యాన్లతో చిన్నారులు ఇలా కష్టపడుతూ కనిపించారు. పెద్ద వాళ్లకు బదులుగా బాలబాలికలే నీటి కోసం ఇలా ఇబ్బందులకు గురవుతున్నారు.

Source:Eenadu

గురువారం సెలవు రోజు కావడంతో పర్యాటక ప్రాంతమైన వరంగల్‌ జిల్లాలోని ఖిలావరంగల్‌ కోటను తిలకించేందుకు పర్యాటకులు తరలివచ్చారు. ఎటువంటి రక్షణ జాకెట్‌లు ధరించకుండా నీటిలోకి వెళ్లడం ప్రమాదకరం. నిర్వాహకులు ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోకపోవడం శోచనీయం.

Source:Eenadu

సాధారణంగా ఒక గబ్బిలం కనబడితేనే ఆశ్చర్యంగా చూసే రోజులివి. అలాంటిది ఒకేచోట వేల సంఖ్యలో అవి తారసపడితే ఎలా ఉంటుందో ఆలోచించండి.. నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జి) మండలం రాంపూర్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న మర్రి చెట్టుని వేలాది గబ్బిలాలు ఆవాసం చేసుకున్నాయి.

Source:Eenadu

తూర్పు గోదావరి జిల్లా కడియపు లంకలోని పచ్చని విరివనాల్లో డాల్ఫిన్‌ ఆకారంలో మామిడికాయ కాసింది. దీన్ని చిలకముక్కు మామిడి అని పిలుస్తారని రైతు కుప్పాల దుర్గారావు చెప్పారు. దీనికి సంబంధించిన మొక్కలను ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తీసుకువచ్చినట్లు తెలిపారు.

Source:Eenadu

హైదరాబాద్‌లోని నార్సింగి మైహోం అవతార్‌ నుంచి కోకాపేట సర్వీసు రోడ్డు మార్గాన్ని ఇటీవల విస్తరించారు. రోడ్డు విభాగినుల మధ్య ఆకట్టుకునే వివిధ ఆకృతులు ఏర్పాటు చేశారు. అందులో ఒకప్పటి నాణేలైన పైసా, నయా పైసా, 2 పైసల నాణేలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

Source:Eenadu

తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న డా.బీఆర్‌ అంబేడ్కర్‌ భారీ విగ్రహం రాజ్యాంగ నిర్మాత జయంతి రోజైన ఏప్రిల్‌ 14న ఆవిష్కరించనున్నారు. తుది మెరుగులు దిద్దుకుంటున్న సచివాలయ సముదాయం, పక్కనే అంబేడ్కర్‌ విగ్రహం, వెనుక బిర్లా టెంపుల్‌ ఇలా కనిపించాయి.

Source:Eenadu

చిత్రం చెప్పే విశేషాలు (23-04-2024/1)

ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ అంటే..

సత్యభామ వచ్చేస్తోంది..

Eenadu.net Home