చిత్రం చెప్పే విశేషాలు

(04-04-2023/1)

ఎండలు మండుతున్నాయి.. దాహానికి పక్షులు అల్లాడుతున్నాయి.హైదరాబాద్‌ నగర శివారు హయత్‌నగర్‌ మండలం కుంట్లూరు గ్రామ శివారులో తాటి చెట్టుపై ఏర్పాటుచేసిన ముంతపై చిలకలు వాలి తాటి గెలలోనుంచి కారుతున్న కల్లు చుక్కలను తాగుతున్న చిత్రమిది. Source:Eenadu

కరీంనగర్‌ జిల్లాలోని ఇల్లందకుంట రైతు వేదికలో పోషణ్‌ పక్వాడాలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు, ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన చిరుధాన్యాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఎంపీపీ ఎస్‌.పావని ఎంపీడీవో వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Source:Eenadu

హైదరాబాద్‌ నగర నెహ్రూ జూపార్కులోని జంతువులకు, పక్షులకు వేసవిలో చల్లదనం కల్పించే ఏర్పాట్లను జూన్‌ వరకు కొనసాగిస్తామని జూ క్యూరేటరు ప్రశాంత్‌ బాజీరావుపాటిల్‌ పేర్కొన్నారు. నీరు చల్లే సుమారు 200 స్ప్రింక్లర్లు, చిన్న ఎయిర్‌గన్‌లు ఏర్పాటు చేశారు.

Source:Eenadu

వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలోని ఊర చెరువు నిండు కుండలా ఉండి చేపలు భారీ సైజులో పెరిగాయి. వాటిని సాధారణ వలలతో పట్టడం సాధ్యం కాలేదు. మత్స్యకారులు సోమవారం చేపలను ఒడ్డుకు తేవడానికి భారీ క్రేన్‌ను ఉపయోగించి 20 టన్నుల వరకు చేపలను పట్టినట్లు వారు తెలిపారు.

Source:Eenadu

ఒక్క ఆలోచనతో బాటసారుల దృష్టి ఆకర్షిస్తున్నాడో చిరు వ్యాపారి. పిల్లలు ఆడుకునే బొమ్మపై బండరాయి పెట్టి కొనేవారికి నాణ్యతపై నమ్మకం కలిగేలా ఇలా ఏర్పాటు చేశాడు. హైదరాబాద్‌లోని బాలాపూర్‌ శివాజీ చౌక్‌ వద్ద రహదారి వెంట విక్రయానికి ఉంచాడు.

Source:Eenadu

దొనెట్క్స్‌ రీజియన్‌లోని పరాస్కోవివ్కాలో రష్యా గిడ్డంగిపై ఉక్రెయిన్‌ దాడి అనంతరం అలుముకున్న పొగ

Source:Eenadu

పైవంతెన పిల్లర్లు, వయాడక్ట్‌ పనులు పూర్తయినా హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఛే నంబర్‌ చౌరస్తా వద్ద రహదారి మరమ్మతుకు నోచుకోవడం లేదు. ఈ రహదారిపై ప్రయాణిస్తుంటే నడుములు విరుగుతున్నాయని, వాహనాలూ పాడవుతున్నాయని వాపోతున్నారు.

Source:Eenadu

తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు సోమవారం కనులపండువగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు.

Source:Eenadu

మధ్యప్రదేశ్‌లో హనుమంతుడికి భారీ లడ్డూను ఏప్రిల్‌ 6న హనుమాన్‌ జయంతి సందర్భంగా నైవేద్యంగా సమర్పించనున్నారు. జబల్‌పుర్‌లో ఉన్న పురాతన పంచమాతా హనుమంతుడి ఆలయంలో నైవేద్యం కోసం టన్ను బరువున్న లడ్డూను తయారుచేశారు.

Source:Eenadu

వనపర్తి జిల్లాలోని గోపాల్‌పేట నుంచి చెన్నూకు వెళ్లే దారిలో రోడ్డుకు సమీపంలో ఈ సిలికేశ్వరం చెట్టు ఉంది. దీనికి ఆకులన్నీ రాలిపోగా 10 రోజుల క్రితం(మార్చి 24) ఒక్క ఆకు కూడా కనిపించలేదు. 10 రోజుల తర్వాత (ఏప్రిల్‌ 3) అదే చెట్టు పచ్చని ఆకులతో కళకళలాడుతూ ఆకట్టుకుంటుంది.

Source:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(27-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(24-07-2025)

Eenadu.net Home