చిత్రం చెప్పే విశేషాలు

(20-03-2024/2)

ద్విచక్రవాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చొనే వారు తప్పని సరిగా శిరస్త్రాణం ధరించాలని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. ఓ యువకుడు సైకిల్‌పై హెల్మెట్‌ ధరించి వెళ్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. 

నూతనకల్‌ మండలం యడవెల్లి గ్రామంలో చీమలకుంట చెరువు జలకళ సంతరించుకుంది. పిచ్చుకలు.. శత్రువుల బారి నుంచి రక్షణ లభిస్తుందని ఇక్కడి ముళ్లున్న తుమ్మ చెట్టును ఎంచుకొని పదుల సంఖ్యలో గూళ్లు కట్టుకొన్నాయి. 

లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై మంగళవారం ముఖానికి రంగులు అద్దుకుని అవగాహన కల్పిస్తున్న చెన్నైలోని కన్యకాపరమేశ్వరి కళాశాల విద్యార్థినులు

చెరుకు తరలిస్తున్న ఈ ట్రాక్టరు ట్రాలీలను చూస్తుంటే ‘బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి’ అనే పాట గుర్తుకు వస్తోంది కదూ.. కొత్తపేట మండలంలోని రామకృష్ణాపురం సమీపంలో ఉన్న చక్కెర కర్మాగారానికి చెరుకును తరలించేందుకు మహారాష్ట్ర నుంచి ట్రాక్టర్‌ ట్రాలీలు వచ్చాయి. 

మన్యంలో వేసవిలోనూ మంచు కురిసింది. గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి.మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఇబ్బందులకు గురిచేసింది. మూడు గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం, ఆ తర్వాత పొగమంచు కురిసింది.వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం లభించింది.

కాంక్రీటు భవనాల మధ్య పిచ్చుకలు కనుమరుగవుతున్నాయి. బుల్లిప్రాణుల్ని కాపాడేందుకు అంతా ముందుకు రావాలని బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా విన్నవించారు. బుధవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఆయన మంగళవారం సైకత యానిమేషన్‌ తీర్చిదిద్దాడు.

ఆహ్లాదం కోసం పిల్లలు, పెద్దలు తిరిగే ట్యాంక్‌బండ్‌ ప్రాంతమిది. మ్యాన్‌హోల్‌ను ఎలా వదిలేశారో చూడండి. చూడక అడుగులేస్తే చిన్నారుల పాదాలు ఇరుక్కుపోవా?

శ్రీకాకుళం నగర పరిధిలో పెద్దపాడు రోడ్డులో కనిపించిన చిత్రమే. ఆటోవాలాల కక్కుర్తి పిల్లల ప్రాణాల మీదకు తీసుకొస్తోంది. నిత్యం పరిమితికి మించి ఇలాంటి ఆటోలు నగరం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. పోలీసులకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు.

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్‌.. అదనంగా తెలంగాణ బాధ్యతలు స్వీకరించారు. 

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home