చిత్రం చెప్పే విశేషాలు

(11-09-2024/1)

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం రూ.కోటి విరాళానికి సంబంధించిన చెక్కును నేడు సీఎంకు ఆయన అందజేశారు.

 ఏ చెయ్యి తిరిగిన కళాకారుడో గీసిన చిత్రమో కాదు. త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి, బాలా త్రిపురసుందరీ దేవి ఆలయాల పర్వత గిరుల మధ్య మంగళవారం సాయంత్రం ప్రకృతిలో కనిపించిన వి‘చిత్రం’.  

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్నచిత్రం బీబీఎస్12. సంయుక్త కథానాయిక. బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.

కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే కొన్న వేల ఎకరాలు కాలి బూడిదయ్యాయి. 

తెలంగాణ పోలీసు అకాడమీలో పాసింగ్‌ అవుట్ పరేడ్‌ నిర్వహించారు. దీనికి సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్‌ అకాడమీలో క్రీడా భవనాన్ని ప్రారంభించారు.

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్‌లోని సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద లక్ష్మీ గణపతి రుద్ర హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 280 జంటలతో 70 హోమ గుండాల మధ్య ఈ లక్ష్మీ గణపతి రుద్ర హోమం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లారు. ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బాధితులతో స్వయంగా మాట్లాడారు.

 తిరుమల శ్రీవారిని కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్‌, కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

స్ఫూర్తి నింపే విషయాలివీ

స్ఫూర్తినింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home