చిత్రం చెప్పే విశేషాలు

(21-09-2024/1)

వెంకటేశ్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో కొత్త సినిమా తెరకెక్కుతోంది. తాజాగాఈ సెట్‌లో నటుడు బాలకృష్ణ సందడి చేశారు. వెంకటేశ్‌, అనిల్‌తో కాసేపు సరదాగా మాట్లాడారు. 

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్ (119*: 176 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేశారు. గిల్‌ ఖాతాలో ఇది ఐదో శతకం. 

కరీంనగర్‌లోని ఆల్ ఫోర్స్ డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య మర్యాద పూర్వకంగా కలిశారు. త్వరలో జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. 

సీఎం రేవంత్‌ కొండా లక్ష్మణ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించింది. శనివారం ఈ చిత్రానికి మహేశ్‌బాబు సతీమణి నమ్రత క్లాప్‌ కొట్టి షూటింగ్‌ ప్రారంభించారు. 

లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన కుమార్తె ఆద్యతో కలిసి తిలకించారు. ఈ క్రమంలోనే ఆద్య కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ముచ్చటపడగా.. వెంటనే పవన్‌ దానికి కొనుగోలు చేశారు. 

స్ఫూర్తి నింపే విషయాలివీ

స్ఫూర్తినింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home