చిత్రం చెప్పే విశేషాలు!

(14-12-2022/1)

పార్లమెంటు సమావేశాల సందర్భంగా మాజీ ప్రధాని హెచ్‌.డి. దేవేగౌడను పరామర్శిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.

source:eenadu

కర్ణాటకలోని చామరాజనగర తాలూకా పణ్యదహుండికి చెందిన మహేశ్‌- యోగిత వివాహంలో సాగులో తోడుగా నిలిచే ఎద్దుల సమక్షంలోనే తన వివాహం జరగాలని తల్లిదండ్రులు, అత్తమామలను ఒప్పించారు. పూలతో అలంకరించిన ఎద్దులను వాటిపై మండపం పక్కన ఉంచారు.

source:eenadu

రాజంపేట మండలంలోని అన్నమయ్య జలాశయానికి మంగళవారం వరద ప్రవాహం పెరిగిందని ఏఈ నాయక్‌ తెలిపారు. దాదాపు 3 వేల క్యూసెక్కుల వరకు చేరుకుందన్నారు. గతేడాది నవంబరు 19వ తేదీన వరదలకు జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.

source:eenadu

 ఈ నెల 12వ తేదీ రాత్రి మైలవరం జలాశయం నుంచి 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో జమ్మలమడుగు సమీపంలోని పెన్నానదిపై అప్రోచ్‌ రహదారి కింద వేసిన గొట్టాలు కొట్టుకుపోతాయని అధికారులు రెండు చోట్ల గండికొట్టి వరద నీటిని మళ్లించారు. ఆ చిత్రమే ఇది.

source:eenadu

హైదరాబాద్‌ సుందరీకరణలో భాగంగా ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ సమీపంలో ఇలా రెండు జీరాఫీ బొమ్మలు ఏర్పాటు చేశారు. నెక్లెస్‌ రోడ్డుకు వచ్చేవారు ఇక్కడ ఆగి తమ చరవాణిలో ఓ ఫొటో తీసుకుని వెళ్తున్నారు.

source:eenadu

మేఘాలయ టీఎంసీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం షిల్లాంగ్‌ చేరుకొన్నాక.. సంప్రదాయ డోలు వాయిస్తున్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

source:eenadu

జపాన్‌ రాజధాని టోక్యోలో జరిగిన మిస్‌ ఇంటర్నేషనల్‌ 2022 పోటీల టైటిల్‌ విజేత జాస్మిన్‌ సెల్‌బర్గ్‌ (జర్మనీ)

source:eenadu

చెరువు కాదు.. పార్కేనండోయ్‌.. ఇది నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్‌ పార్కు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇలా నీటిమయమైంది. అడుగుపెట్టలేని పరిస్థితే కాదు.. పిల్లలు ఆడుకునే వస్తువులూ నీటిలో తడిసి తుప్పుపడుతున్నాయి. అధికారులు నీటిని బయటకు పంపేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home